వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి ప్రకాశం ఎమ్మెల్యే గుడ్ బై..!! టచ్ లో వైసీపీ నేతలు : జగన్ గ్రీన్ సిగ్నల్..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీకి ప్రకాశం జిల్లాలో భారీ జలక్ తగలనుంది. వైసీపీ హవా కొనసాగిన సమయంలో టీడీపీ ప్రకాశం జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకుంది. అందులో అద్దంకి నుండి గొట్టిపాటి రవి కుమార్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఇదే నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవి ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించారు. అప్పటికే టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న కరణం బలరాం తో గొట్టిపాటి రవికి రాజకీయంగా పోరు ఉంది. టీడీపీలో ఈ ఇద్దరి వర్గాల మధ్య గొడవలు జరిగాయి. అయితే అద్దంకి సీటు ముందుగానే టీడీపీ అధినేత చంద్రబాబు డిసైడ్ చేసారు.

అవంతి వర్సెస్ గంటా... విశాఖలో వీరి రాజకీయ మంట .. అసలు రీజన్ ఇదేనా ?అవంతి వర్సెస్ గంటా... విశాఖలో వీరి రాజకీయ మంట .. అసలు రీజన్ ఇదేనా ?

గొట్టిపాటి రవికి కేటాయించారు. దీంతో కరణం బలరాం అసహనంతో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో చీరాల నుండి ఆమంచి క్రిష్ణ మోహన్ వైసీపీ అభ్యర్దిగా చీరాల నుండి బరిలోకి దిగటంతో..చంద్రబాబు అక్కడి నుండి కరణం బలరాంను పోటీకి దించారు. దీంతో..ఆయన అక్కడి నుండి గెలిచారు. ఇక, ఇప్పుడు గొట్టిపాటి రవి టీడీపీలో మనస్పూర్తిగా కొనసాగటం లేదని తెలుస్తోంది. ఆయన పార్టీ కార్యక్రమాల్లోనూ అంతగా పాల్గొనటం లేదు. ఇదే సమయంలో రవితో బీజేపీ నేతలు సైతం మంతనాలు సాగించారు. కానీ, రవి తిరిగి వైసీపీకి రావాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి వైసీపీ నేతలు సైతం సై అన్నట్లుగా తెలుస్తోంది.

గొట్టిపాటి రవి తిరిగి వైసీపి లోకి...

గొట్టిపాటి రవి తిరిగి వైసీపి లోకి...

తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుండి అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవి తిరిగి వైసీపీలో చేరుతున్నారనే ప్రచార జోరుగా సాగుతోంది. ఆయన 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం ను ఓడించారు. జగన్ పార్టీ స్థాపించిన తరువాత విప్ ధిక్కరించి అనర్హత వేటుకు గురైన రవి 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా కరణం వెంకటేష్ మీద గెలుపొందారు. ఇక, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయం లో ఆయన టీడీపీలోకి ఫిరాయించారు. చేరిన నాటి నుండి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, కరణం బలరాం ను కాదని తనకే అద్దంకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించటంతో రవి టీడీపీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో రవి అద్దంకి నుండి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసారు. పార్టీ కంటే..వ్యక్తిగత ఇమేజ్ తోనే రవి అక్కడ గెలుపొందారు. అయితే గొట్టిపాటి రవి టీడీపీలో అయిష్టంగానే కొనసాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ..పార్టీ సమావేశాల్లో రవి యాక్టివ్ గా ఉండటం లేదని అనుచరులు చెబుతున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు.. అధినాయ కత్వం మీద ఉన్న అభిప్రాయంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగా ఆయన తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. తనకు రాజకీయంగా ఉన్న అవకాశాలు..అదే సమయంలో తిరిగి పార్టీ మారితే ఏర్పడే అభిప్రాయల గురించి ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.

బీజీపీ నేతల ప్రయత్నం..

బీజీపీ నేతల ప్రయత్నం..

టీడీపీ నుండి బీజేపీలో చేరిన కీలక నేతలు ప్రకాశం జిల్లా నుండి యాక్టివ్ గా ఉండి.. సొంత బలంతో గెలిచే సత్తా ఉన్న గొట్టిపాటి రవిని బీజేపీలోకి తీసుకెళ్లేందుకు మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, రవి మాత్రం వారికి ఎటువంటి హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. బీజేపీకి ఏపీలో అంత ఆదరణ లేదని..ఇప్పట్లో సాధ్యం కాదనే భావనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీలో ఉండలేని పరిస్థితుల్లో ఆయన తిరిగి వైసీపీలోకి వెళ్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కొందరు మధ్య వర్తులు వైసీపీలో జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలతో రవి తిరిగి వైసీపీలోకి తీసుకొనే అంశం పైన చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. రవి అనుచరులు సైతం పార్టీ మారాలనుకుంటే తిరిగి వైపీపీలోకి వెళ్లాలని సూచించినట్లు చెబుతున్నారు. అయితే, వైసీపీలోకి రావాలంటే ఇప్పటికే జగన్ తన విధానం స్పష్టం చేసారు. ఎమ్మెల్యే ఉన్న వారు తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీ లోకి రావాలని స్పష్టం చేసారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్యేకు సైతం వైసీపీ నేతలు అదే విషయాన్ని స్పష్టం చేయగా..ఆయన సిద్దమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఆ నేతకు మాత్రం తిరిగి ఎమ్మెల్యేగా కాకుండా..ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ఇక, రవి తాను వైసీపీలో చేరాలని నిర్ణయిస్తే ఎమ్మెల్యే పదవికి రాజానామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

జగన్ సైతం ఓకే చెప్పారా...

జగన్ సైతం ఓకే చెప్పారా...

గొట్టిపాటి రవి విషయంలో ముఖ్యమంత్రి జగన్ సైత ఓకే చెప్పారని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. కేవలం ప్రకాశం.. తూర్పు గోదావరి..విశాఖలో మాత్రమే టీడీపీ రెండు సీట్లకు పైగా సాధించింది. దీంతో.. విశాఖ..తూర్పు గోదావరి.. ప్రకాశం జిల్లాల్లో ఎమ్మెల్యేల పైన వైసీపీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ జిల్లాల్లో టీడీపీకి అండగా నిలుస్తున్న సామాజిక వర్గ ఎమ్మెల్యేలు..నేతలను ప్రధానంగా తమ పార్టీలోకి తీసుకొని అటు టీడీపీకి..బీజేపీ ప్రయత్నాలకు అవకాశం లేకుండా చేయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో.. వైసీపీ నేతల వ్యూహాలు..అంచనాలు ఫలిస్తే ప్రకాశం జిల్లా నుండి గొట్టిపాటి రవి అదే విధంగా విశాఖ నుండి ఒక ఎమ్మెల్యే వైసీపీలో చేరటానికి సిద్దంగా ఉన్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం.

English summary
TDP Mla From praksam dist Gottipati Ravi may join in YCP shortly. AP Ruling party leaders in touch with Ravi to invite him in party. Sources said that Ravi also ready to leave his mla post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X