వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ టీడీపీ నేతకు చేదు అనుభవం .. 'రైతు భరోసా'కు వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న వైసీపీ నేతలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో టీడీపీ , వైసీపీల మధ్య బాహాబాహీ ఆగటం లేదు . తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే, టీడీపీ నేత బాల వీరాంజనేయస్వామికి చేదు అనుభవం ఎదురయింది. టీడీపీ ఎమ్మెల్యే ను వైసీపీ నేతలు అడ్డుకోవటంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ నేతలకు , ఎమ్మెల్యేలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కస్టమర్ లాకర్లో ఉండాల్సిన నగలు తాకట్టులో .. ఎస్బీఐ ఉద్యోగుల లీలలుకస్టమర్ లాకర్లో ఉండాల్సిన నగలు తాకట్టులో .. ఎస్బీఐ ఉద్యోగుల లీలలు

Recommended Video

టీడీపీ ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటీషన్
రైతు భరోసా కార్యక్రమానికి వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యే అడ్డగింత .. వెనక్కి వెళ్ళిన ఎమ్మెల్యే బాల

రైతు భరోసా కార్యక్రమానికి వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యే అడ్డగింత .. వెనక్కి వెళ్ళిన ఎమ్మెల్యే బాల

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో నేడు వైసీపీ సర్కార్ నిర్వహిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే బాల వెళ్లారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావాలనే ఉద్దేశంతోనే ఆయన వెళ్ళారు. కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యేను వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఇది వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమం అని టీడీపీ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొనటానికి వీలు లేదని వారు ఎమ్మెల్యే లోపలకు వెళ్లేందుకు ఒప్పుకోమన్నారు. ఆయన వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు ఇచ్చారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అడ్డుకున్నప్పటికీ పోలీసులు మాత్రం ఎమ్మెల్యేకు ఏ విధమైన రక్షణ కల్పించలేదు . దీంతో చేసేది ఏం లేక ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిఅక్కడ నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు .

 వైసీపీ శ్రేణులు అడ్డుకోవటంతో అసంతృప్తిలో బాల .. పోలీసుల తీరుపై ఆగ్రహం

వైసీపీ శ్రేణులు అడ్డుకోవటంతో అసంతృప్తిలో బాల .. పోలీసుల తీరుపై ఆగ్రహం

ఇక ఆయన ఈ సంఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనను వైసీపీ నేతలు అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు ఆయన ముందుగానే పోలీసులకు సమాచారం అందించానన్నారు. అయినప్పటికీ పోలీసులు తనకు ఎలాంటి రక్షణ కల్పించలేదన్నారు. ఓ ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయనప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవుతున్న తనను అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.ప్రోటోకాల్ ప్రకారమే తానూ కార్యక్రమానికి వెళ్లానని కానీ వైసీపీ శ్రేణుల తీరు మాత్రం దారుణం అని ఆయన మండిపడ్డారు .

ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్న వైసీపీ శ్రేణులు .. జగన్ కట్టడి చెయ్యాలన్న డిమాండ్

ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్న వైసీపీ శ్రేణులు .. జగన్ కట్టడి చెయ్యాలన్న డిమాండ్

ఇకవైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలుతుంది అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క టీడీపీ కార్యకర్తలు, మద్దతు దారులపైన దాడులు చెయ్యటమే కాదు మరోపక్క ఎమ్మెల్యేలను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత , ఏపీ సీయం జగన్ స్పందించి పార్టీ శ్రేణులను కట్టడి చెయ్యాలని వారు కోరుతున్నారు.

English summary
MLA Bala went to attend the YSR raithu bharosa Program organized by YcP Sarkar in Ongole town of Prakasam district today. He went on to pursue a government program in the rank of an MLA. TDP MLA going to the event set up at Kalyana Mandapam, blocked by the YCP workers and supporters at the gate.This is a program run by the YCP and the TDP MLA is not allowed to participate in the program. They demanded to go back immediately. The police have not provided any protection to the MLA despite the blockade of large-scale YCPs. This is what the MLA's bala Veeranjaneeswamy has gone back from there
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X