ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు షాక్: తెరాసలోకి ఎమ్మెల్యే నగేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Babu
ఆదిలాబాద్: తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ తగలనుంది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం శాసనసభ్యుడు గోడం నగేష్ ప్రకటించారు. బుధవారంనాడు ఆయన ఈ ప్రకటన చేశారు.

బజార్‌హత్నూరు మండలం జాతర్ల గ్రామంలో నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, నాలుగైదు రోజుల్లో కె. చంద్రశేఖర రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతున్నట్లు ఆయన ఆ సమావేశంలో చెప్పారు.

ఇరవై ఏల్లుగా తన రాజకీయ జీవితానికి సహాయ పడిన తెలుగుదేశం పార్టీని వీడడం బాధగానే ఉన్నా ఇది అనివార్యమైందని నగేష్ అన్నారు. తెలంగాణ పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగానే తాను పార్టీ వీడుతున్నట్లు ఆయన తెలిపారు.

తెలుగుదేశం పార్టీ నుంచి మరింత మంది తమ పార్టీలోకి వస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు అంటున్నారు. చివరి నిమిషంలో కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించారని వారు విమర్శిస్తున్నారు.

English summary

 Telugudesam MLA from Adilabad disrtict Nagesh has decided to quit party and join in K Chandrasekhar Rao lead Telangana Rastra Samithi (TRS) soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X