• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్: రుయా ఆస్పత్రిలో 11 కాదు 31 మంది మృతి, వారి పేర్లు, చిరుమాలతో సహా టీడీపీ నేత జాబితా

|

అమరావతి: ఇటీవల తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించినవారి సంఖ్య విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తున్నాయి. 50 మంది వరకు ఈ ఘటనలో కరోనా బాధితులు మరణిస్తే.. కేవలం 11 మంది మాత్రమే చనిపోయారంటూ ప్రభుత్వం ప్రకటించిందంటూ తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, పార్టీ శాసనసభా పక్ష నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

రుయా ఆస్పత్రి ఘటనలో ఎవరిష్టమొచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు..

రుయా ఆస్పత్రి ఘటనలో ఎవరిష్టమొచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు..

తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక చనిపోయినవారి వివరాలు తమ వద్ద ఉన్నాయన్న రామానాయుడు.. 31 మంది మృతుల పేర్లు, వయసు, చిరునామాతో సహా జాబితాను విడుదల చేశారు. ఆస్పత్రిలో 5 నిమిషాలే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని కొందరు, 35 నిమిషాలపాటు ఆగిపోయిందని మరికొందరు.. 40 నిమిషాలంటూ ఇంకొందరు.. ఇలా సీఎం, మంత్రులు, అధికారులు ఎవరికి తోచినవిధంగా వారు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనలో వాస్తవాలు బయటికి రావాలంటే సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని నిమ్మల డిమాండ్ చేశారు.

50 మంది చనిపోయారంటూ నివేదిక.. రూ. కోటి సాయం చేయాలి

50 మంది చనిపోయారంటూ నివేదిక.. రూ. కోటి సాయం చేయాలి

జగన్ సర్కారు తప్పిదం వల్లే రుయాలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని.. అందుకే వాటిని ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలన్నారు. ఏపీ సీఎం తప్పిదం వల్ల చనిపోతున్న ప్రతి బాధితుడి కుటుంబానికి రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.

మే 10న రుయా ఘటన జరిగితే.. 11న ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో చిత్తూరు జిల్లాల్లో 18 మంది చనిపోయినట్లు పేర్కొంది. ఒక్క రుయా ఆస్పత్రిలోనే దాదాపు 50 మంది వరకూ చనిపోయారని ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన నివేదికలో ఉందని, ఈ రెండింటిలో ఏదీ వాస్తవమని రామానాయుడు ప్రశ్నించారు.

10 రోజులుగా ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం..

10 రోజులుగా ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం..

ఘటన జరిగిన రోజు ఉదయం రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ అంతా సక్రమంగా ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని.. తర్వాత గంటల వ్యవధిలోనే 50 మంది వరకూ చనిపోయారని ఆస్పత్రిని చెబుతోందని అన్నారు. దీనిపై విచారణ జరపాలని నిమ్మల డిమాండ్ చేశారు. వారం పదిరోజులుగా ఆక్సిజన్ సరఫరాలో అంతరాయాలున్నట్లు మృతుల బంధువులు చెబుతున్నారని, ప్రాణాలు పోయేంత వరకు ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.

180కిపైగా మరణాలు.. రుయాకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు?

180కిపైగా మరణాలు.. రుయాకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు?

ఆక్సిజన్ సరఫరా ట్యాంకర్లకు జీపీఎస్ విధానాన్ని అనుసంధానించలేదని, గ్రీన్ ఛానల్ లాంటి చర్యలు కూడా తీసుకోలేదని మండిపడ్డారు. రుయా ఆస్పత్రి ఘటనకు బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించిన ఆయన.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదని, బాధితులకు ఎందుకు భరోసా కల్పించలేదని నిలదీశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఆక్సిజన్ అందక రాష్ట్రంలో 180 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు నిమ్మల రామానాయుడు. రుయా ఆస్పత్రి ఘటన జలియన్‌వాలా‌బాగ్ ఉదంతాన్ని గుర్తు చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  AP CM Jagan : AP లో కర్ఫ్యూ, Vaccination పై కీలక నిర్ణయాలు..!! || Oneindia Telugu
  రుయా ఆస్పత్రిలో మరణించినవారి జాబితా ఇదే: నిమ్మల రామానాయుడు

  రుయా ఆస్పత్రిలో మరణించినవారి జాబితా ఇదే: నిమ్మల రామానాయుడు

  1.డి షాహిత్(27), వరదయ్యపాలె, చిత్తూరు

  2. షేక్ మహమ్మద్ బాషా(49), గోవింద్ నగర్, తిరుపతి
  3. జయచంద్ర, 5/18సుందరయ్యనగర్, తిరుపతి
  4. కే బాబు(55), వాసవి సాయి టవర్స్, తిరుపతి
  5. ఆదిలక్ష్మి(48), శ్రీకాళహస్తి
  6. సీ. తనూజా రాణి(48) కేఎల్ఎం ఆస్పత్రి, గాజులమండ్యం
  7. పీ గౌస్ బాషా(37), కొత్తపేట, పుంగనూరు
  8. ఎస్ ఫాజుల్లా(41), కలికిరి
  9. బీఎస్ మునీర్ సాహెబ్(49), డోర్ నెంబర్ 7-14, బస్టాండ్ వీధి, మర్రిపాడు, గుర్రంకొండ
  10. పీ సుధాకర్(36), చౌడేశ్వర్ నగర్, మదనపల్లె
  11. బీ గజేంద్రబాబు(36), కురవపల్లి, పుంగనూరు
  12. బీ సులోచన(52), కలకడ
  13. వై వేణుగోపాల్(55), మదనపల్లె
  14. రమణాచారి(40), పీలేరు
  15. ఎస్కే కలదర్(48), కుక్కలదొడ్డి, రైల్వేకోడూరు మండలం, కడప
  16. ఎం పార్వతమ్మ(60), బొమ్మయ్యగారిపల్లి, రొంపిచర్ల
  17. నారాయణ తాళ్లూరు(55), ఎస్ఎన్ కాలనీ, రాయచోటి, కడప
  18. సుబ్బయ్య(67), హెచ్.చెర్లోపల్లి, రాజంపేట
  19. ఆవుల వెంకటసుబ్బయ్య(29), హెచ్.చెర్లోపల్లి, రాజంపేట
  20. బీ. దేవేందర్ రెడ్డి(60), ఆదినవరపల్లి, యర్రావారిపాలెం, చిత్తూరు
  21. జీ భువనేశ్వర్ బాబు(36), తేజనగర్, చిత్తూరు
  22. ఎన్ ప్రభాకర్, 22-13-394-13 తిరుమలనగర్, శెట్టిపల్లి మంగళం, చిత్తూరు
  23. పీఎస్ రామారావు, తొండవాడ, చిత్తూరు
  24. సీ మదన్మోహన్ రెడ్డి(52), చిత్తూరు
  25. ఎన్ శివప్రియ(33), చిత్తూరు
  26. ఎన్ మోహన్ దాస్, 12/3/6, నగరి
  27. కే దుర్వాసులు(34), పాకాల
  28. ఎం రాజమ్మ, వల్గమూడి నెల్లూరు
  29. టీ రమేష్ బాబు(39), తిరుపతి
  30. జీ వాణి, రాజీవ్ గాంధీ కాలనీ, తిరుపతి
  31. కే సరోజమ్మ, తారకరామనగర్, కరకంబాడి

  English summary
  TDP MLA Nimmala Ramanaidu releases dead persons list in Ruia hospital
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X