వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విషయంలో చంద్రబాబు సూచనలను పాటించిన వైఎస్ జగన్

|
Google Oneindia TeluguNews

అమరావతి: అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. ఈ పోస్టును ప్రతిపక్ష సభ్యులకు ఇవ్వడం ఆనవాయితీ. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పీఏసీ ఛైర్మన్ పదవి కోసం పయ్యావుల కేశవ్ ను ఎంపిక చేశారు. పీఏసీతో పాటు అంచనాల కమిటీ, ప్రభుత్వరంగ కమిటీలను ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. అంచనాల కమిటీకి పీడిక రాజన్నదొర, ప్రభుత్వరంగ కమిటీకి చిర్ల జగ్గిరెడ్డి ఛైర్మన్లుగా నియమితులయ్యారు.

పీఏసీలో.. పయ్యావుల కేశవ్‌ తో పాటు సంజీవయ్య, కోలగట్ల వీరభద్ర స్వామి, మేరుగ నాగార్జున, భూమన కరుణాకర్‌ రెడ్డి, కరణం ధర్మశ్రీ, జోగి రమేష్‌, ఉషశ్రీ చరణ్‌, కాటసాని రామ్ భూపాల్‌ రెడ్డి, బీద రవీచంద్ర, జగదీశ్వరరావు, బాలసుబ్రమణ్యం సభ్యులుగా నియమితులయ్యారు. పీడిక రాజన్న దొర ఛైర్మన్ గా నియమితులైన అంచనాల కమిటీలో గుడివాడ అమర్‌ నాథ్‌, ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, గొర్లె కిరణ్‌ కుమార్‌, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కైలే అనిల్‌ కుమార్‌, మదిశెట్టి వేణు గోపాల్‌, గిరిధర్ రావు, ఆదిరెడ్డి భవాని, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్‌ బాబు, వెన్నపూస గోపాల్‌ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

TDP MLA Payyavula Keshav appointed as a Chairman of Public Accounts Committee of AP Assembly

ప్రభుత్వ రంగ కమిటీకి చిర్ల జగ్గిరెడ్డి ఛైర్మన్ గా నియమితులు కాగా.. గ్రంధి శ్రీనివాస్‌, కిలారి వెంకట రోశయ్య, జొన్నలగడ్డ పద్మావతి, అన్నా రాంబాబు, శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, రవీంద్రనాథ్‌ రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వాసుపల్లి గణేష్‌, వెంకట సత్యనారాయణ రాజు, జీ దీపక్‌రెడ్డి, సోము వీర్రాజు సభ్యులు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దివంగత భూమా నాగిరెడ్డి, ఆయన తరువాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయించిన అనంతరం ఈ పదవి బుగ్గనను వరించింది.

English summary
Telugu Desam Party MLA Payyavula Keshav appointed as a Assembly Public Accounts Committee Chairman of Andhra Pradesh. As per the tradition, Chairman of the PAC should be an Opposition, then Government of Andhra Pradesh choosen Payyavula Keshav as per the Opposition leader Andhra Pradesh Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X