వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీవిఎల్ పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న : స‌్పీక‌ర్ కు టిడిపి ఎమ్మెల్యే నోటీసు

|
Google Oneindia TeluguNews

ఏపి శాస‌న‌స‌భ లో టిడిపి స‌భ్యుడు..బిజెపి రాజ్య‌స‌భ స‌భ్యుడి పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చారు. టిడిపి - బిజెపి మ‌ధ్య జ‌రుగుతున్న మాట‌ల యుద్దం ఇప్పుడు నోటీసుల వ‌ర‌కు వెళ్లింది. ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి జివిఎల్ అనుచిత వ్యాఖ్య‌లు చేసార‌ని..ఇది శాస‌న వ్య‌వ‌స్థ‌నే అవమానించ‌ట‌మేన‌ని ఈ నోట‌సులో పేర్కొన్నారు.

స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు

స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు

ఏపి శాస‌న స‌భ‌లో టిడిపి స‌భ్యుడు శ్రావ‌ణ్ కుమార్ బిజెపికి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు జివిఎల్ న‌ర‌సింహారావు పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు జీవిఎల్ పై చ‌ర్యలు తీసుకోవాల‌ని తాడికొండ ఎమ్మెల్యే శ్రావ‌ణ్ కుమార్ కోరారు. శాస‌న‌స‌భ లో వ్య‌వ‌సాయం పై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ అనంత‌రం శ్రావ‌ణ్ ఈ విష‌యాన్ని లేవ‌నెత్తారు. అసెంబ్లీలో బిజెపి శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణు కుమార్ రాజు , మాణిక్యాల రావుతో సీయం చంద్ర‌బాబు ప్రవ‌ర్తించిన తీరు చూస్తూ పిచ్చి పీక్స్‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ రౌడీలా ప్ర‌వ‌ర్తించా రు అంటూ ఈనెల 2వ తేదీన జీవిఎల్ ట్విట్ట‌ర్ ద్వారా వ్యాఖ్యానించార‌ని శ్రావ‌న్ వివ‌రించారు. త‌న వ్యాఖ్య‌ల ద్వారా ఆయ‌న సీయం చంద్ర‌బాబునే కాకుండా..శాస‌న వ్య‌వ‌స్థ‌నే అవ‌మానించార‌ని పేర్కొన్నారు. దీనికి స్పందించిన స్పీక‌ర్ నోటీసు అందింద‌ని, నిబంధ‌న‌ల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

జివిఎల్ సైతం స్పందించారు..

జివిఎల్ సైతం స్పందించారు..

శాస‌న‌సభ‌లో ఏపికి కేంద్ర సాయం పై ప్ర‌త్యేక చ‌ర్చ‌ను ఈ నెల 1న చేప‌ట్టారు. ఆ స‌మయంలో బిజెపి ఎమ్మెల్యేలు మాణి క్యాల రావు, విష్ణుకుమార్ రాజు కేంద్రం కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు. అప్పుడే స‌భ‌లోకి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి అప్పటి వ‌ర కు విష్ణుకుమార్ రాజు చేసిన ప్ర‌సంగం పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. కేంద్రం ఏ ర‌కంగా ఏపిని మోసం చేసంద‌నే అంశం పై వివ‌రిస్తూ..ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించారు. దీని పై బిజెపి ఎంపి జీవిఎల్ ఈ ట్వీట్ చేసారు. దీని పై టిడిపి ఎమ్మెల్యే ఆ ట్వీట్ కాపీతో పాటుగా స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చారు.

నోటీసు ఎలా ఇస్తార‌ని

నోటీసు ఎలా ఇస్తార‌ని

దీని పై జీవిఎల్ స్పందిస్తూ తాను ఎవ‌రి గురించి అను చితంగా మాట్లాడ‌లేద‌ని..తాను రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉండ‌గా..త‌న పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. మ‌రి..ఈ వ్య‌వ‌హారం పై ఎటువంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

English summary
TDP Mla Sravan Kumar given privilege notice against Rajyasabha member GVL in AP Assembly on his remarks against Cm Chandra babu in twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X