• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ ప్రజల సొమ్ముతో తెలంగాణాకు లబ్ది చేస్తారా జగన్... అని ప్రశ్నిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే

|

ఏపీలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందంటూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జగన్ పై విరుచుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో జగన్ భజన తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగిన చర్చ ఏమీ లేదని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులున్నాయో అలాంటి పరిస్థితి నేడు కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

జగన్ కు ఆ విషయంలో హితవు పలికిన పురంధరేశ్వరి ..

  జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
   బీజేపీతో స్నేహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

  బీజేపీతో స్నేహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

  ఇక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ షాకింగ్ కామెంట్ చేశారు. బీజేపీతో మళ్లీ కలుస్తారా? అన్న ప్రశ్నకు సమాధానంగా అనగాని సత్యప్రసాద్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కదా అంటూ చెప్పుకొచ్చారు. ఇక జగన్ పాలన పై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కెసిఆర్ తో జగన్ దోస్తీ కొంపముంచుతుందని పేర్కొన్నారు. తెలంగాణ భూభాగంలో ఏపీ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం ఆలోచించడం సరైనది కాదని, అనాలోచిత నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రజల సొమ్ముతో తెలంగాణకు లబ్ధి చేకూర్చేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ టిడిపి ఎమ్మెల్యే ఆరోపించారు.

  కేసీఆర్ చేసిన సాయానికి క్విడ్ ప్రోకో తరహాలో ఋణం తీర్చుకుంటున్న జగన్ అన్న టీడీపీ ఎమ్మెల్యే

  కేసీఆర్ చేసిన సాయానికి క్విడ్ ప్రోకో తరహాలో ఋణం తీర్చుకుంటున్న జగన్ అన్న టీడీపీ ఎమ్మెల్యే

  ఇక నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య చేసుకున్నది ఒప్పందం కాదని కేసీఆర్-జగన్ మధ్య లాలూచీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన సాయానికి క్విడ్‌ప్రోకో తరహాలో జగన్ రుణం తీర్చుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అనగాని సత్య ప్రసాద్.

  ఒకప్పుడు జగన్ కు హిట్లర్ లా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు దేవుడిలా కనిపిస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన 63 రోజుల్లో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు.

  జగన్ నిర్ణయాలతో రాష్ట్రం తిరోగమనం వైపు నడుస్తుందన్న టీడీపీ ఎమ్మెల్యే అనగాని

  జగన్ నిర్ణయాలతో రాష్ట్రం తిరోగమనం వైపు నడుస్తుందన్న టీడీపీ ఎమ్మెల్యే అనగాని

  ఎన్నికల మ్యానిఫెస్టో భగవద్గీత, బైబిల్‌ అని చెప్పిన జగన్ దాని అమలు కోసం ఎలాంటి కృషి చేయడం లేదని అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అన్న క్యాంటిన్లు మూసేయడం సరికాదన్నారు. పేరు మార్చైనా పేద ప్రజలకు అన్నం పెట్టాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మొత్తానికి జగన్ పాలన పై టిడిపి నేతలు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని మండిపడుతున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం తిరోగమనం దిశగా నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  రాష్ట్రంలో దారుణమైన అరాచక పాలన కొనసాగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  TDP MLA Satyaprasad shocking commenting that there are no permanent enemies and friends in politics. Will you reconnect with the BJP? In answer to that question, Satyaprasad said, "Nobody knows what happens in politics."The MLA, who has been criticized of the Jagan regime, has said that Jagan firiendship with the KCR is very dangerous . He said that it was not a right decision for the government to think about AP projects in Telangana. The TDP MLA alleged that Jagan is making decisions to benefit Telangana with AP people's money.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X