• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జూన్ 19 తర్వాత టీడీపీలో ఏం జరగబోతోంది ? ఈసారి ఆగస్టు సంక్షోభం ముందే వస్తోందా ?

|

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన టీడీపీకి ఆగస్టు నెలతో ఎంతో అనుబందం ఉంది. గతంలో టీడీపీ ఎదుర్కొన్న సంక్షోభాలన్నీ ఆగస్టులోనే కావడంతో ఆ పార్టీ నేతలకు ఈ నెల ప్రాధాన్యమేంటో తెలుసు. కానీ ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల్లో వైసీపీ ప్రభుత్వంలోకి ఫిరాయించాలని భావించిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. మహానాడు సమయంలోనే వీరు ఫిరాయిస్తారని భావించినప్పటికీ... అలాంటిదేమీ లేదని స్పష్టం చేసిన వీరంతా.. ఇంకా పక్కచూపులు చూస్తున్నట్ల తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది.

మహానాడుకు ముందు పరిస్ధితి...

మహానాడుకు ముందు పరిస్ధితి...

టీడీపీ ఏటా వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే పార్టీ పండుగ మహానాడుకు ముందే ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను ప్రభుత్వంవైపు తిప్పుకోవాలని వైసీపీ భావించింది. ఇందుకు తగిన రంగం సిద్దం చేసింది. అప్పటికే స్ధానిక మంత్రులతో మంతనాలు సాగిస్తున్న వీరు... మహానాడు ప్రారంభానికి ముందే సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్ సమక్షంలో కండువా కప్పుకోవడం ఖాయమని భావించారు. కానీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి తాము టీడీపీలోనే కొనసాగుతామని చెప్పేశారు. దీంతో వీరి పార్టీ మార్పు వ్యవహారం సమసిపోయిందని అంతా భావించారు.

విప్ భయంతోనే వాయిదా...

విప్ భయంతోనే వాయిదా...

మహానాడుకు ముందే తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీవైపు చూస్తున్నారన్న సమాచారం రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రలోభాలకు లొంగొద్దని సూచించారు. అయినా ఓ దశలో మాట వినే పరిస్ధితి లేదని తేలిపోవడంతో పార్టీని వీడిన ద్రోహులకు తిరిగి రానివ్వబోనంటూ మహానాడు వేదికగా బాబు హెచ్చరికలకు దిగారు. అయితే ఆ తర్వాత ఈ వ్యవహారం కాస్త శాంతించడంతో టీడీపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎమ్మెల్యేలు తాత్కాలికంగా వెనక్కి తగ్గడానికి కారణం రాజ్యసభ ఎన్నికల విప్ అన్నది ఇప్పుడు అర్ధమవుతోంది.

కొత్త ముహుర్తం అదేనా....!

కొత్త ముహుర్తం అదేనా....!

మహానాడుకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ప్రకటించకపోవడంతో ఇదంతా వైసీపీ ఆడించిన మైండ్ గేమ్ అని అంతా భావిస్తున్నతరుణంలో పరిస్ధితి మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. దీంతో తాజాగా మరోసారి టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ వైసీపీ మంత్రులతో టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం మొదలైంది. వైసీపీ వర్గాల తాజా సమాచారం ప్రకారం టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు జూన్ 19న జరిగే రాజ్యసభ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి గుడ్ చై చెప్పే అవకాశముంది.

 ఎవరెవరు ఉండొచ్చు ?

ఎవరెవరు ఉండొచ్చు ?

వైసీపీలోకి ఫిరాయిస్తారని భావిస్తున్న వారిలో అత్యధికులు ప్రకాశం, గుంటూరు జిల్లాల వారీ ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి, విశాఖ ఎమ్మెల్యేలకు అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. తాజాగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలు, సన్నిహితులు, వైసీపీ మంత్రులు, నేతలతో వీరు మాట్లాడుతున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యల ఆధారంగా వీరి ఫిరాయింపులు ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. మహానాడుకు ముందు అనుకున్న స్ధాయిలో వీరు ఫిరాయిస్తే మాత్రం టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా, చంద్రబాబు విపక్ష నేత హోదా కోల్పోవడం ఖాయంగా చెప్పవచ్చు.

English summary
several opposition tdp mlas in andhra pradesh who are in touch with ruling ysrcp government are planning to defect after rajya sabha polls on june 19th, according to latest reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X