వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు నెత్తిన పిడుగు.. టీడీపీకి కరణం బలరాం గుడ్ బై.. గొట్టిపాటి రవి కూడా.. సీఎం జగన్‌తో భేటీ..

|
Google Oneindia TeluguNews

సరిగ్గా స్థానిక ఎన్నికలకు ముందు అన్ని జిల్లాల్లో అన్ని స్థాయిల నేతలు ఒక్కొక్కరుగా అధికార పార్టీలో చేరుతుండటంతో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వరుస షాకులు తగులుతున్నాయి. అయితే వైసీపీలోకి జంప్ అయినవారిలో చాలామంది పదవులులేని మాజీలే ఎక్కువగా ఉన్నారు. బుధవారం మాత్రం ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంకావడం చంద్రబాబుపై పిడుగుపాటు లాంటి వార్తే. ఆ ఇద్దరిలో ఒకరు.. బాబు సమకాలీకుడు, ఎన్డీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచీ నమ్మకంగా టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న మాజీ మంత్రి, ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కావడం విశేషం. మెరుపులాంటి మరో ట్విస్ట్ ఏంటంటే..

సీఎంతో అపాయింట్‌మెట్ ఖరారు

సీఎంతో అపాయింట్‌మెట్ ఖరారు

ఎవరి పేరుచెబితే కరణం బలరాం మండిపడతారో, ఆ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా బలరాంతోనే కలిసి వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ప్రకాశం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే ఈ చేరికల ప్రక్రియ.. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కరణం, గొట్టిపాటిలు గురువారం తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో సీఎం జగన్ ను కలవనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 3గంటలకు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

పెద్ద తలకాయ..

పెద్ద తలకాయ..

1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కరణం బలరాం తనదైన ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లాలో మాత్రం తన మాటే చెల్లుబాటయ్యేలా వ్యవహరించేవారు. రాష్ట్రవ్యాప్తంగానూ ఆయనకు ఫాలోయింగ్, అభిమానులున్నారు. పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్ అయినప్పటికీ కొంతకాలంగా కరణం ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పట్టుపట్టిమరీ గొట్టిపాటి రవికుమార్ ను అద్దంకి నియోజకవర్గంలో దింపడం బలరాంకు మిగుడుపడలేదు. గొట్టిపాటి కారణంగా ఆయన తన సొంత నియోజకవర్గం అద్దంకిని వదిలేసి.. చీరాలలో పోటీచేసి గెలిచినప్పటికీ.. ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహారాలకు ఎడంగా ఉంటున్నారు.

కరణం వెంకటేశ్ కూడా..

కరణం వెంకటేశ్ కూడా..

మాజీ మంత్రి కరణం బలరాంతోపాటు ఆయన కొడుకు కరణం వెంకటేశ్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వెంకటేశ్.. 2014లో అద్దంకి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓడిపోయారు. తర్వాతి కాలంలో చంద్రబాబు ఆకర్ష్ ఆపరేషన్ లో భాగంగా వైసీపీ నుంచి టీడీపీకి జంప్ అయిన 23 మంది ఎమ్మెల్యేల్లో గొట్టిపాటి కూడా ఒకరు. అప్పట్లో రవికుమార్ చేరికను కరణం తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ చంద్రబాబు మాత్రం గొట్టిపాటికే మద్దతిచ్చి.. బలరాంను అద్దంకి నుంచి చీరాలకు పంపారు. అయిష్టంగానే పోటీచేసి గెలిచినా.. సొంత నియోజకవర్గానికి దూరమయ్యాననే బాధ బలరాంను వెంటాడుతోంది.

ఎందుకు చేరుతున్నారు?

ఎందుకు చేరుతున్నారు?


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కీలక నేతల్ని టార్గెట్ చేస్తుండటం, కీలకమైన వ్యాపార కార్యకలాపాలపైనా ఫోకస్ పెంచిన నేపథ్యంలో తమ్ముళ్లందరిలో భయం పట్టుకుంది. జేసీ దివాకర్ రెడ్డిపై జగన్ కొరడా ఝుళిపించడం చూసిన తర్వాత టీడీపీ నేతల్లో భయాలు మరింత పెరిగిపోయాయని, అధికార పార్టీకి అనుకూలంగా ఉండటమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారని, అదీగాక.. నియోజకవర్గాల అభివృద్ధికి కూడా అంతో ఇంతో నిధులు పొందొచ్చన్న ఉద్దేశంతోనే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మార్పునకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. అయితే..

Recommended Video

Gottipati Ravi Kumar Likely To Leave TDP, And Joins In YCP || వైసీపీకి వలస కడుతున్న టిడిపి నేతలు !
మరి రాజీనామా చేస్తారా?

మరి రాజీనామా చేస్తారా?


ఇతర పార్టీల నుంచి గెలిచినవాళ్లెవరైనా వైసీపీలో చేరాలనుకుంటే కచ్చితంగా రాజీనామా చేసి తీరాల్సిందేనని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా, పలు మార్లు బహిరంగ వేదికలపైనా ఘంటాపథంగా చెప్పారు. ఆ లెక్కల చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా రాజీనామాలు చేసిన తర్వాతే వైసీపీలో చేరాల్సి ఉంటుంది. కానీ అలాంటి అవసరం లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు ఫాలో అయిన దారినే కరణం, గొట్టిపాటిలు అనుసరించనున్నారు. అంటే, టెక్నికల్ గా వైసీపీలో చేరకుండా.. సీఎం జగన్ కు మద్దతు తెలుపుతూ.. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే విధానమన్నమాట.

English summary
just before local body elections, another shock for tdp in andhra pradesh. senior leaders chirala mla karanam balaram likely to join in ysrcp. addanki mla gottipati ravikumar also in touch with ysrcp leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X