వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాళ కూడా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌- ఈసారి ఏడుగురు...

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజు 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్‌ కాగా.. రెండోరోజు ఓ ఎమ్మెల్యే, మూడో రోజు 9 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్‌ అయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారన్న కారణంతోనే వీరిపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. ఇవాళ కూడా అదే పరిస్ధితి చోటు చేసుకుంది.

ఏపీ అసెంబ్లీలో ఇవాళ సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతోంది. ఇందులో ముందుగా పింఛన్ల పెంపుపై జరిగిన చర్చ రచ్చకు దారి తీసింది. టీడీపీ ఎమ్మెల్యే రామనాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో తడబడిన అధికార పక్షం.. చివరికి ఆయనకు ప్రివిలేజ్‌ నోటీసులు ఇవ్వడంతో పాటు వచ్చే ఏడాది పించన్ల పెంపు ఉంటుందని ప్రకటించి బయటపడింది. ఆ తర్వాత కూడా మిగతా సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పదే పదే సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిందారు.

tdp mlas suspensions continue in ap assembly, seven members expelled today

Recommended Video

Coronavirus Cases In Andhra Pradesh

అసెంబ్లీలో అధికార వైసీపీ తమ హయాంలో సంక్షేమం జరగలేదని చెప్పడాన్ని ఆక్షేపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. వారిని తమ స్ధానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే సూచించినా టీడీపీ సభ్యులు శాంతించలేదు. చివరికి ఏడుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని స్పీకర్‌ ఆమోదించారు.. సస్పెండైన టీడీపీ సభ్యుల్లో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బాల వీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణ బాబు, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్‌ ఉన్నారు.

English summary
seven tdp mlas were suspended from ap legislative assembly today for interrupting house proceedings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X