విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ మార్ఫింగ్ ట్రిక్స్ నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్: కమిషనర్‌కు బుద్ధా వెంకన్న ఫిర్యాదు..!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసే ముష్టి అయిదు రూపాయల కోసం కక్కుర్తి పడుతున్నారని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తోన్న వారిని తాను అంత సులభంగా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. వారిపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

ఇంతకీ ఆయన ఆగ్రహానికి కారణమేమిటంటే.. చంద్రబాబుకు అనుకూలంగా విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ తరఫున కొద్ది రోజుల కిందట బుద్ధా వెంకన్న ఓ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. యు ఆర్ ద బెస్ట్ సీఎం అని, నెవర్ అగైన్ అనే అక్షరాలను దాని మీద ముద్రించారు. అక్కడిదాకా బాగానే ఉంది. ఇదే ఫ్లెక్సీపై యు ఆర్ ద బెస్ట్ సీఎం అనే అక్షరాలకు బదులుగా యు ఆర్ ద వరస్ట్ సీఎం అనే పదాలను ముద్రించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

TDP MLC Buddha Venkanna filed a complaint at Vijayawada Police Commissioner

ఆ ఫొటో.. బుద్ధా వెంకన్న ఆగ్రహానికి కారణమైంది. తాను అలాంటి పదాలను ఫ్లెక్సీపై ముద్రించలేదని, అయినప్పటికీ.. అసలు ఫ్లెక్సీ ఫొటోను మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. వైఎఎస్ఆర్సీపీ కార్యకర్తల మార్ఫింగ్ టెక్నిక్స్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఫొటోను మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

వైఎస్ జగన్ దొంగ అయితే అంతకంటే పెద్ద దొంగలమని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిరూపించుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ వేసే ముష్టి అయిదు రూపాయిల కోసం ఎంతకైనా దిగజారుతున్నారని విమర్శించారు. ఆరోపణలు చేసుకోవచ్చు గానీ ఇలాంటి చిల్లర పనులు చేయొద్దని ఆయన హితవు పలికారు. ఇదే పద్ధతిని ఇక ముందు కూడా కొనసాగిస్తే వైఎస్ జగన్ దొంగ బతుకు బయటపెడుతూనే ఉంటానని హెచ్చరించారు. ఫొటోను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకునేంత వరకూ వదలబోనని అన్నారు.

TDP MLC Buddha Venkanna filed a complaint at Vijayawada Police Commissioner
English summary
Telugu Desam Party MLC Buddha Venkanna filed a complaint at Vijayawada Police Commissioner against the YSR Congress Party Social Media wing for spreading fake information about him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X