వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై లోకేష్‌ తీవ్ర వ్యాఖ్యలు- పులివెందుల పిల్లి అంటూ- పొన్నూరులో సగం కట్టిన గోడపై..

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్‌ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో ప్రతీ చిన్న అంశం కూడా పెద్దదిగా మారిపోతోంది. తాజాగా ఇదే కోవలో గుంటూరు జిల్లా పొన్నూరులో ఓ ప్రభుత్వ భవనం ప్రహరీ గోడ ప్రారంభోత్సవానికి స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ కార్యకర్త ఒకరు సోషల్‌ మీడియాలో చేసిన కామెంట్లపై పోలీసులు అతన్ని అరెస్టు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ జగన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్లు మరింత వివాదాస్పదం అయ్యాయి.

గుంటూరు జిల్లా పొన్నూరులో సగం కట్టిన గోడకు గ్రాండ్‌ ఓపెనింగ్‌ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అంటూ సోషల్‌ మీడియాలో టీడీపీ కార్యకర్త మణిరత్నం చేసిన పోస్టుకు అతన్ని అరెస్టు చేయడం దారుణమని లోకేష్‌ విమర్శించారు. పులివెందుల పిల్లి టీడీపీ కార్యకర్తలను చూసి భయపడుతోందని సీఎం జగన్‌ను ఉద్దేశించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సగం కట్టిన గోడకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేయాలనుకోవడమే సిగ్గుచేటని, గోడ గ్రాండ్‌ ఓపెనింగ్‌ను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన టీడీపీ కార్యకర్తను అరెస్టు చేయడం మరింత దారుణమని లోకేష్‌ విమర్శించారు.

tdp mlc nara lokesh controversial comments on cm ys jagan over ponnur incident

పొన్నూరులో టీడీపీ కార్యకర్త అరెస్టు ప్రభుత్వ పిరికితనాన్ని బయటపెట్టిందని టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్‌ ఆరోపించారు. వైసీపీ నాయకులు చెప్పినట్లు ఆడుతున్న కొంత మంది పోలీసులు ఇలాంటి అక్రమ అరెస్టులతో సాధించేదేమీ ఉండదని, ప్రతిగా కష్టాలు కొని తెచ్చుకోవడం తప్ప అంటూ లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులపై దుమారం చెలరేగుతుండగానే తాజాగా పోలీసులు టీడీపీ కార్యకర్త మణిరత్నాన్ని అరెస్టు చేయడం విమర్శలకు తావిస్తోంది.

English summary
tdp mla nara lokesh on today condemns arrest of tdp activist mani ratnam's arrest over posting an incomplete government building wall in ponnur in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X