• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నీ అమ్మ మొగుడు భాషలో.. రూ.1300 కోట్లతో వైసీపీ స్కీమ్.. జాతకాలు తేలే టైమొచ్చిందన్న లోకేశ్

|

''ప్రజా వేదిక కూల్చివేతతో పాపిష్టి జగన్ తుగ్లక్ పాలన ప్రారంభమైంది. 9నెలల్లో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసారు. ప్రతిపక్ష పార్టీ పై కక్ష సాధింపులు ఫుల్లు... అభివృద్ధి ,సంక్షేమాలు మాత్రం నిల్లు. తొమ్మిది నెలల్లో తుగ్లక్ జగన్ ప్రవేశపెట్టినవి మూడే మూడు పథకాలు. అవేంటో వింటే విని విస్తుపోవద్దని మనవి.. ''అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పార్టీ చీఫ్ చంద్రబాబు బుధవారం 'ప్రజా చైతన్య యాత్ర' పేరుతో ప్రకాశం జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభించగా.. దానికి సమాంతరంగా లోకేశ్ కూడా అదే పేరుతో మంగళగిరిలో యాత్ర చేపట్టారు.

మొదటి స్కీం: కలర్

వైసీపీ సర్కారు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రారంభించిన మూడు పథకాల్లో మొదటిది కలరింగ్ స్కీం అని లోకేశ్ తెలిపారు. రూ.1300 కోట్ల ప్రజాధనంతో రాష్ట్రంలోని పంచాయతీ భవనాలు, స్కూళ్లు, స్మశానాలు, ఆఖరికి మరుగుదొడ్లకు కూడా వైసీపీ రంగులు వేసుకుని సీఎం సంబరపడిపోయారని ఎద్దేవా చేశారు. ఈ కలరింగ్ స్కీం వ్యవహారంపై కోర్టులు కూడా చివాట్లు కోర్టు చివాట్లు పెట్టాయని ఆయన గుర్తుచేశారు.

రెండో స్కీం: లాంగ్వేజ్

‘‘తుగ్లక్ జగన్ ప్రవేశపెట్టిన రెండో గొప్ప స్కీం.. వైసీపీ భాషా పథకం. తండ్రిని మనం తెలుగులో నాన్న అని పిలుస్తాం. అదే ఇంగ్లీషులోనైతే ఫాదర్ అంటాం. కానీ వైసీపీ భాషలో మాత్రం నీ అమ్మ మొగుడు అంటారు. మంత్రుల దగ్గర్నుంచి మామూలు కార్యకర్తల దాకా వైసీపీ నేతలంతా అమ్మ మొగుడు బాషను చాలా బాగా ముందుకు తీసుకెళుతున్నారు''అని లోకేశ్ మండిపడ్డారు.

మూడో స్కీం: రివేంజ్

మూడో స్కీం: రివేంజ్

సీఎం జగన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న మూడో పథకం రివేంజ్ అని.. అక్రమాలను ఎత్తిచూసిన కారణంగా తెలుగు దేశం పార్టీ నాయకులపై జగన్ కక్ష తీర్చుకుంటున్నారని లోకేశ్ ఆరోపించారు. తుగ్లక్ నిర్ణయాలు ఎండగడుతున్నందుకే టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని, చివరికి మాజీ సీఎం చంద్రబాబుకు భద్రత తగ్గించడంలోనూ జగన్ రాజకీయాలు చేస్తున్నారని లోకేశ్ ఫైరయ్యారు.

కొద్దిరోజుల్లో జాతకాలు తెలుస్తాయి..

కొద్దిరోజుల్లో జాతకాలు తెలుస్తాయి..

తొమ్మిది నెలల పాలనలో సీఎం జగన్ చేసిన తప్పుడు పనులు, తప్పిన మాటలు చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుందన్న నారా లోకేశ్.. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి జాతకం ఏంటో బయటపడిపోతుందని, షాకింగ్ ఫలితాలకు వైసీపీ సిద్ధంగా ఉండాలని అన్నారు.

45 ఏళ్లకే బీసీ,ఎస్సి,ఎస్టీ మహిళలకు పెన్షన్ అని చెప్పి

45 ఏళ్లకే బీసీ,ఎస్సి,ఎస్టీ మహిళలకు పెన్షన్ అని చెప్పి

‘‘45 ఏళ్లకే బీసీ,ఎస్సి,ఎస్టీ మహిళలకు పెన్షన్ అని చెప్పి ఇవ్వలేదు.. డ్వాక్రా రుణాలు ఒక్క రూపాయీ మాఫీ కాలేదు.. వృద్ధులను రూ.3 వేల పెన్షన్ అని 250 మాత్రమే పెంచారు. 7 లక్షల పెన్షన్లు తీసేసారు. 20 లక్షల రేషన్ కార్డులు ఎత్తేశారు. దివ్యాంగులు పెన్షన్లూ కొతపెట్టారు. తొమ్మది నెలల్లో అప్పుల‌బాధ‌తో 270 మంది రైతుల ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నారు. రైతు భరోసా రూ.12,500 అని చెప్పి 7,500 మాత్రమే చెల్లించారు. కౌలు రైతుల్ని మోసం చేశారు. నిరుద్యోగభృతి ఇవ్వకపోగా, ఉన్న కంపెనీలను బెదిరించి పారిపోయేలా చేస్తున్నారు. 4 లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చి.. అసలైన నిరుద్యోగుల్ని రోడ్డునపడేశారు. ఎన్సార్సీ, ఎన్ పీఆర్ లకు మ‌ద్ద‌తిచ్చి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు. మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్‌ ను మతం పేరుతో దూషించారు. ప్రజారాజధాని అమరావతిని నాశనం చేశారు...''అంటూ జగన్ వైఫల్యాల చిట్టాను లోకేశ్ చదివి వినిపించారు.

English summary
tdp national secretary and mlc nara lokesh slams cm jagan over three capitals and several other issues. he started praja chaitanya yatra in mangalagiri parallelly with tdp chief chandrababu bus yatra on wednesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more