వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అటునుంచి నరుక్కొస్తున్న చంద్రబాబు.. ఢిల్లీలో కీలక భేటీలు ఖరారు.. రంగంలోకి లోకేశ్ టీమ్

|
Google Oneindia TeluguNews

ఏపీకి ఎల్లప్పుడూ అండగా ఉంటానన్న 'కీలక' వ్యక్తి ద్వారా టీడీపీ చీఫ్ చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ పీఏ శ్రీనివాస్ పై ఐటీ దాడులు.. రూ.2వేల కోట్ల అక్రమాస్తుల గుర్తింపు.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు.. మోదీ కేబినెట్ లోకి వైసీపీ చేరబోతోందన్న వార్తలు.. తదితర ప్రతికూలతల నడుమ టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏం చెయ్యబోతున్నారంటే..

ఏం చెయ్యబోతున్నారంటే..

ఏపీలో శాసన మండలి రద్దు, దానికి ముఖ్యకారణమైన మూడు రాజధానుల ఏర్పాటు అంశాల్లో వైసీపీ సర్కారు, సీఎం జగన్ తీరుపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీల బృందం మంగళవారం ఢిల్లీకి వెళ్లనుంది. కేవలం రాజకీయ కారణాల వల్లే మండలిని రద్దు చేయడం దుర్మార్గమని, దానికి దారితీసిన పరిణామాలనూ టీడీపీ నేతలు కేంద్ర పెద్దలకు వివరించనున్నారు.

ఎవరెవర్ని కలుస్తారంటే..

ఎవరెవర్ని కలుస్తారంటే..

టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటనకు సంబంధించి పార్టీ చీఫ్ చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రుల అపాయింట్‌మెంట్లు కోరారు. కొంతకాలంగా చంద్రబాబుపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో వాళ్లెవరూ టీడీపీ ఎమ్మెల్సీలను కలవడానికి సుముఖత చూపనట్లు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాత్రం ఉదారత ప్రదర్శించారు. మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్సీల టీమ్.. సాయంత్రం 5 గంటలకు వెంకయ్యను కలవనుంది. ఈ మేరకు ఉపారాష్ట్రపతి కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది.

లోకేశ్ నాయకత్వం?

లోకేశ్ నాయకత్వం?

ఏపీ శాసన మండలి రద్దు, మూడు రాజధానుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీకి వెళ్ళనున్న టీడీపీ ఎమ్మెల్సీల బృందం రెండ్రోజులు అక్కడే మకాం వేయనుంది. ఈ బృందానికి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వం వహిస్తారని తెలుస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు దగ్గరుండి లోకేశ్ ను నడిపిస్తారని సమాచారం. అశోక్ బాబు, బుద్ధా వెంకన్న, దీపక్ రెడ్డి, రామ్మోహన్, సత్యనారాయణరాజు తదితరులు లోకేశ్ టీమ్ లో ఉన్నారు.

Recommended Video

Nara Lokesh Visits Help Hospital And Scolds AP CM Jagan || Oneindia Telugu
జగన్ కు చెక్ పెట్టేలా..

జగన్ కు చెక్ పెట్టేలా..


ఏపీ సీఎం వైఎస్ జగన్ గతవారం రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు కీలక శాఖల మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఆ సమావేశాల తర్వాత వైసీపీ నేతలు మాట్లాడుతూ.. శానసమండలి రద్దు, సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లు అంశాలపై కేంద్రం సానుకూలంగా ఉందని, రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే మండలి రద్దు బిల్లుకు ఆమోదం లభిస్తుందని తెలిపారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీల పర్యటనతో సీఎం జగన్ కు ఏమేరకు చెక్ పెడతారన్నది చూడాలి.

English summary
tdp mlcs delhi tour: including vice president venkaiah they likely to meet key leaders over ap issues
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X