• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపీ ఆ విషయంలో విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

|

టీడీపీ లోక్ సభా పక్ష నేత గల్లా జయదేవ్ లోక్ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను సాధించేప్రయత్నంలో వైఎస్సార్సీపీ విజయం సాధించాలని కోరుకున్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. ఏపీ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో రాష్ట్ర ప్రజలు వైసీపీకి 22 సీట్లు కట్టబెట్టారన్న గల్లా లోక్ సభలో మాట్లాడుతూ ఇప్పుడు అందరి కళ్లు వైఎస్సార్సీపీపైనే ఉన్నాయని చెప్పారు.

  రైతులనుంచి భూములు లాక్కోవడం అవసరమా..?- జగన్
  రాష్ట్ర ప్రయోజనాలు , ప్రత్యేక హోదా సాధించటంలో వైసీపీ విజయం సాధించాలన్న గల్లా

  రాష్ట్ర ప్రయోజనాలు , ప్రత్యేక హోదా సాధించటంలో వైసీపీ విజయం సాధించాలన్న గల్లా

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు టీడీపీ సాధించలేనిది వైసీపీ నాయకులు సాధిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో వారు విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన ప్రయత్నాలలో విజయం సాధించాలని గల్లా జయదేవ్ ఆకాంక్షించారు. ఆయన ఇచ్చిన కొత్త నినాదం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రజలకు సరిసమానంగా అందాలని కోరుకున్నారు. నరేంద్రమోడీ అలాగే పని చెయ్యాలని ఆయన ఆకాంక్షించారు .

  ప్రత్యేకహోదా కోసం టీడీపీ పోరాటం చేసింది ..ఇక ఇప్పుడు వైసీపీ వంతు అన్న గల్లా

  ప్రత్యేకహోదా కోసం టీడీపీ పోరాటం చేసింది ..ఇక ఇప్పుడు వైసీపీ వంతు అన్న గల్లా

  అంతేకాదు తాజాగా లోక్ సభలో ఎంపీ గల్లా జయదేవ్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. గత ఐదేళ్లకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం టీడీపీ తీవ్రంగా పోరాడిందని గుర్తు చేస్తూ హోదా తీసుకురాలేదనే ఏకైక కారణంతో తమ పార్టీని ప్రజలు ఓడించారని ఎంపీ గల్లా పేర్కొన్నారు . మరోవైపు హోదాపై మాట తప్పిన కారణంగానే రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదని ఆయన అన్నారు . ఇదిలా ఉంటే హోదా తీసుకొస్తారనే ఏకైక కారణంతో ప్రజలు వైసీపీని గెలిపించారని పేర్కొన్న గల్లా జయ్ దేవ్ హోదా సాధించాలన్న కోరిక ఏపీ ప్రజల్లో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చారు.

  హోదా హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ దే హోదా తెచ్చే బాధ్యత అన్న గుంటూరు ఎంపీ

  హోదా హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ దే హోదా తెచ్చే బాధ్యత అన్న గుంటూరు ఎంపీ

  హోదా అనేది 5 కోట్ల ఆంధ్రుల ఆంకాంక్ష అని పేర్కొనటంతో పాటు హోదాను కేంద్రం తిరస్కరించడమంటే తెలుగు ప్రజల ఆంక్షలపై నీళ్లు చల్లినట్లేనని ఆయన తన ఆభిప్రాయం వ్యక్తం చేశారు. . జగన్ హోదా తీసుకొస్తానని ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జనాలకు విజ్ఞప్తి చేశారు. హోదా తీసుకొస్తారనే ఏకైక కారణంతో ఏపీ ప్రజలు వైసీపీకి ఓట్లేసి గెలిపించారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ఒకవైపు హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెబుతోంది కానీ హోదా తెస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు జగన్ , ఇప్పుడు హోదా తెచ్చే బాధ్యత జగన్ పార్టీపైనే ఉందని ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The people of the state of Andhra Pradesh are looking forward to what the YCP leaders will achieve TDP. Guntur MP Galla Jayadev has stated that they want to succeed in achieving the benefits of the state of Andhra Pradesh. Galla Jayadev wishes Prime Minister Narendra Modi to succeed in his endeavors. His new slogan, 'Sub ka saath, sub ka vikas, sub ka vishwas' was intended to be given to all states, regions and peoples. TDP MP Galla Jayadev remarked that AP people voted for the YCP as the sole reason for taking the position. On the one hand, the Center says it has not been given status but has come to power by promising to give it status. Jagan is now responsible for the status .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more