విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహానాడులో జెసి హల్ చల్...చంద్రబాబుకే ఆదేశాలు...సిఎం బోల్తా పడ్డారు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఎంపి జెసి దివాకర్ రెడ్డి టిడిపి మహానాడు మూడో రోజు సమావేశాల్లో హల్ చల్ చేశారు. తన ప్రసంగం సందర్భంగా ఆయన అవి ఇవీ అని లేకుండా పార్టీతో సంబంధం ఉన్నవీ లేనివి అన్నీ మాట్లాడేశారు.

Recommended Video

TDP Mahanadu 2018 : Chandrababu Naidu Speech

అంతేకాదు ఒకానొక సమయంలో సభాముఖంగా చంద్రబాబుకే ఆర్డర్లు పాస్ చేశారు. అదేమంటే సామాన్యులు మనతో వచ్చి చెప్పుకోలేరని...అందుకే వారి తరుపున నేను మీకు చెబుతున్నానన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే తన కోరికని ముక్తాయింపు ఇచ్చారు. తాజా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించిన జెసి ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు మీకోసం...

 మోడీ మాటలు...విని మోసపోయాం

మోడీ మాటలు...విని మోసపోయాం

టిడిపి మహానాడు మూడో రోజు సమావేశాల్లో ఎంపి జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ...నరేంద్రమోదీ గంభీరమైన ప్రసంగాలు విని మోసపోయామని విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి ఉన్న నాయకుడని కొనియాడారు. సీఎం ఇప్పటివరకు రాష్ట్రం కోసం ఎంతో చమటోడ్చారని...అలాంటప్పుడు లోకేష్‌ సీఎం అయితే తప్పేంటి? అని జేసీ ప్రశ్నించారు. తన ఆస్తి తమ కొడుకు పవన్‌దేనని అలాగే టీడీపీ వారసుడు లోకేష్ అని, టీడీపీ నాయకుడు కచ్చితంగా లోకేషేనని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని మూడేళ్ల క్రితమే తాను చంద్రబాబుకు చెప్పానని అన్నారు. మోదీ చుట్టూ తిరిగితే ఉపయోగం ఉండదని చెప్పానని, హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్న... ప్యాకేజి ఇస్తామంటే సీఎం బోల్తా పడ్డారని జేసీ అన్నారు.

జగన్ వి...అన్నీ తాతబుద్దులే

జగన్ వి...అన్నీ తాతబుద్దులే

పోలవరంలో అవినీతి జరిగిందని విమర్శలు చేస్తున్నారని, అసలు పోలవరంలో అవినీతి జరిగిందంటే అది కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. పోలవరం ముడుపులు ముట్టాయంటే అవి జగన్‌కే అందాయని జేసీ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని, హోదా విషయంలో చంద్రబాబు చేసిన తప్పేంటో చెప్పాలని జేసీ డిమాండ్ చేశారు. మోదీ ఉన్నంత కాలం హోదా రాదని నాలుగేళ్ల క్రితమే చెప్పానని, కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని జేసీ జోస్యం చెప్పారు. తిరుపతి సాక్షిగా ఇచ్చిన హామీలు మర్చిపోతే ఎలా? అని జేసీ ప్రధాని మోదీని నిలదీశారు.

జగన్ వి...అన్నీ తాతబుద్దులే

జగన్ వి...అన్నీ తాతబుద్దులే

వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎవరి మాట వినేవారుకాదని, ఆయనకు అన్నీ తన తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనను వైసిపిలోకి రమ్మని విజయసాయి రెడ్డి ద్వారా రాయబారం పంపారని, కానీ తనకు జగన్ దగ్గర ఊడిగం చేయడం నచ్చక వెళ్లలేదని జేసీ అన్నారు. టికెట్ ఇస్తాం...వైసీపీలోకి రావాలని జగన్‌ కోరారని, పార్టీలోకి వస్తే ఎన్ని డబ్బులు ఇస్తావని విజయసాయిరెడ్డి తనను అడిగారని...నేను మీకెందుకు కప్పం చెల్లించాలని అన్నానని ఎంపీ జేసీ చెప్పుకొచ్చారు.

 వాళ్ల వల్ల...రెడ్లపై అసహనం

వాళ్ల వల్ల...రెడ్లపై అసహనం

తనతో పెట్టుకుంటే జగన్‌ చరిత్ర మొత్తం బయటపెడతానని... 40 ఏళ్ల చరిత్రను జేసీ గుర్తుచేశారు. జగన్‌లో తాత రాజారెడ్డి క్రూరత్వం ఉందని అన్నారు...స్కెచ్‌ వైఎస్‌ వేస్తే, రాజారెడ్ది దానిని అమలు చేసేవారని జేసీ తెలిపారు. వైఎస్‌ను మంత్రిని చేసేందుకు రాజారెడ్డి చేయని పనులు లేవని జెసి వివరించారు. ఎన్నికల సమయంలో జగన్‌ దగ్గర రూ. వెయ్యి కోట్ల హార్డ్‌ క్యాష్‌ ఉందని జేసీ చెప్పారు. వాళ్లు ఎప్పుడూ చంపాలని, కొయ్యాలి, నరకాలని మాట్లాడతారని, వాళ్లు చేసిన పనుల వల్ల రెడ్లపై ప్రజల్లో అసహనం పెరిగిందని జేసీ వ్యాఖ్యానించారు.

 సిఎంకే...ఆదేశాలు

సిఎంకే...ఆదేశాలు

మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఎంపి జెసి ఆర్డర్లు పాస్ చేశారు. చంద్రబాబు అధికారులపై ఆధారపడటం సరికాదన్నారు. తాను ఎప్పుడు వెళ్లినా ఆర్డీవో దగ్గర నుంచి అందరూ అధికారులు సీఎం టెలికాన్ఫరెన్స్ లో ఉన్నారని చెబుతున్నారని అన్నారు. సిఎం చంద్రబాబు ముందు ఆ టెలికాన్ఫరెన్స్ లు ఆపాలని, అధికారులను పనిచేసుకోనివ్వాలని జెసి కోరారు. కేవలం కలెక్టర్ల తో మాత్రమే చంద్రబాబు కాన్ఫరెన్స్ లు చేయాలని జెసి సూచించారు. సామాన్య వ్యక్తులెవ్వరూ తమ వద్దకు వచ్చి వాస్తవ విషయాలు చెప్పుకోలేరని, తాను క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించానన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం కావాలన్నదే తన అభిమతమని జేసీ చెప్పారు. ఇలా ఎంపి జెసి దివాకర్ రెడ్డి అన్ని విషయాలు టచ్ చేస్తూ చెలరేగిపోవడంపై టిడిపి శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

English summary
Vijayawada: MP JC Diwakar Reddy, care-of address for sensational remarks, was hulchul on the third day of the TDP Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X