విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేని రోగాలు అంటిస్తారా? కరోనా ఐసొలేషన్ వార్డులు మాకెందుకు?: టీడీపీ ఎంపీ కేశినేని నాని:

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని వివాదాల్లో చిక్కుకున్నారు. భయానకంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ అనుమానితులు, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని చికిత్స అందించడానికి ఉద్దేశించిన ఐసొలేషన్ వార్డుల ఏర్పాటుపై ఆయన చేసిన ట్వీట్.. దుమారాన్ని రేపుతోంది. జనావాసాల మధ్య ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయడమేంటని ఆయన అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లు జనావాసాల మధ్య ఉన్నాయనేది కేశినేని వాదన. దీనివల్ల చుట్టుపక్కల వారికి కూడా కరోనా వైరస్ సోకుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కూడా కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది సరికాదని చెప్పారు.

 TDP MP Kesineni Nani demands quarantine should not established in city

విజయవాడ నడిబొడ్డున ఉన్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వం కరోనా వ్యాధిగ్రస్తుల ఐసొలేషన్ వార్డులు మార్చబోతోందని, దీన్ని ప్రతిఘటిస్తామని అంటున్నారు. జనావాసాల మధ్య ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ పేషెంట్లకు ఎలా చికిత్స అందిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

విజయవాడలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ఆరు జిల్లాలకు చెందిన కరోనావ్ యాధిగ్రస్థులకు ఐసోలేషన్వార్డులుగా మారుస్తున్నట్లు తెలుస్తోందని, ఇక్కడ జనావాసాల మధ్యలో ఐసోలేషన్ వార్డులు పెట్టటం ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Recommended Video

Janta Curfew : Actor Nani Important Message To People

English summary
Telugu Desam Party Senior leader and Vijayawada Lok Sabha member Kesineni Nani demands to remove the quarantine, which was established in the City. He demands to remove the quarantine and could be established to outskirts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X