విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోజా స‌స్పెన్ష‌న్‌కు అదే కార‌ణం: జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి స‌వాల్‌గా:కేశినేని ట్వీట్ వెనుక రాజ‌కీయం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

రోజా స‌స్పెన్ష‌న్‌కు అదే కార‌ణం | Kesineni Nani Asked CM And DGP To Action Over Call Money Issue

కాల్ మ‌నీ వ్య‌వ‌హారం ఏపీలో రాజ‌కీయంగా క‌ల‌క‌లం సృష్టించింది. చంద్ర‌బాబు హాయంలో ఈ కాల్ మ‌నీ వ్య‌వ‌హారం లో అనేక మంది మ‌హిళ‌లు సెక్స్ రాకెట్‌లో చిక్కుకున్నారు. నాడు శాస‌న‌స‌భ‌లో ఇదే అంశం పైన ర‌గ‌డ చోటుచేసుకుంది. ఫ‌లితంగా నాడు వైసీపీ ఎమ్మెల్యేల రోజా ఏడాది పాటు స‌స్పెండ్ అయ్యారు. ఇక‌, ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌రిగిన తొలి క‌లెక్ట‌ర్లు..ఎస్పీల కాన్ఫిరెన్స్‌లో సైతం ఈ అంశం పైన సీరియ‌స్‌గా ఉండాలంటూ ఆదేశించారు. ఇప్పుడు తాజాగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని చేసిన తాజా ట్వీట్ ..డీజేపీకి చేసిన సూచ‌న ద్వారా ఈ వ్య‌వ‌హారం మ‌రో సారి తెర మీద‌కు వ‌చ్చింది...ఇంత‌కీ ఆయ‌న ట్వీట్ వెనుక రాజ‌కీయం ఏంటి..

రోజాను సస్పెండ్ చేసిన వ్య‌వ‌హారం..

రోజాను సస్పెండ్ చేసిన వ్య‌వ‌హారం..

ఏపీలో కాల్‌మ‌నీ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో కృష్ణా జిల్లాలో క‌ల‌క‌లానికి కార‌ణ‌మైంది. విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా నాడు నేటి డీజీపీ గౌతం స‌వాంగ్ ప‌ని చేస్తున్న స‌మ‌యంలో ఫిర్యాదులు వ‌చ్చాయి. కాల్‌మ‌నీ వ్య‌వ‌హారంలో ఎక్కువ‌గా నాటి అధికార పార్టీ టీడీపీ నేత‌ల ప్ర‌మేయం ఉంద‌నే ఆరోణ‌లు వెల్లువెత్తాయి. ఇక‌, దీని పైన అప్ప‌ట్లోనే వైసీపీ ఎమ్మెల్యే రోజా స‌భ‌లో టీడీపీ నేత‌లు కొన్ని వ్యాఖ్య‌ల‌తో టార్గెట్ చేసారు. నేరుగా అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లతో అప్ప‌టిక‌ప్పుడు రోజా పైన ఏడాది పాటు స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌, ఆ చ‌ర్చ‌లో విప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేల ప్ర‌మేయం పైన స‌భ‌లో నిల‌దీసారు. దీంతో..అప్పుడు విజ‌య వాడ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ఉన్న గౌతం స‌వాంగ్‌ను త‌ప్పించి ఆయ‌న‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్‌కు బ‌దిలీ చేసారు. ఆ త‌రువాత ఈ వ్య‌వ‌హారం పైనా పెద్ద‌గా చ‌ర్చ..విచార‌ణ ముందుకు సాగలేదు.

జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత‌..

జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత‌..

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఈ అంశం పైన దృష్టి సారించారు. ఈ వ్య‌వ‌హారంలో టీడీపీ నేత‌లు ఉన్నా.. ఏ పార్టీ నేత‌లు ఉన్నా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించారు. ప్ర‌త్యేకంగా డీజీపీ నియ‌మాక స‌మ యంలోనే స‌వాంగ్‌కు ముఖ్య‌మంత్రి దీని పైన ప్ర‌త్యేకంగా సూచ‌న‌లు చేసారు. అయినా..ఇంకా అక్క‌డ‌క్క‌డ ఇప్ప‌టికీ ఈ ఫిర్యాదులు వ‌స్తూనే ఉన్నాయి. విజ‌య‌వాడ‌..గుంటూరు జిల్లాలో ఈ త‌ర‌హా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఇప్పుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు సైతం స‌వాల్‌గా మారింది. గ‌తంలో..ఈ ర‌క‌మైన ఫిర్యాదులు రాగా..ఎవ‌రూ ఎవ‌రికీ వ‌డ్డీలు చెల్లించ‌వ‌ద్ద‌ని..ఎవ‌రైనా ఒత్తిడి చేస్తే జిల్లా ఎస్పీల‌కు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. దీంతో..పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటి విచార‌ణ‌..కేసులు ఏమైనాయో ఎవ‌రికీ తెలియ‌దు. ఇప్పుడు ఏపీలో ప్ర‌భుత్వం మారినా ఆ కేసుల్లో మాత్రం పురోగ‌తి లేదు. ఇక‌, ఇప్పుడు తాజాగా కృష్నా జిల్లా టీడీపీ రాజ‌కీయాల్లో నేత‌ల మ‌ధ్య ఏర్ప‌డిన విబే ధాల‌తో ఈ అంశం తిరిగి తెర మీదకు వ‌చ్చింది.

కేశినేని ట్వీట్..తెర వెనుక రాజ‌కీయం

కేశినేని ట్వీట్..తెర వెనుక రాజ‌కీయం

తాజాగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేసారు. అందులో కాల్ మనీ మాఫియా గురించి అందరి కన్నా మీకే ఎక్కువ తెలుసునని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మాఫియా బారిన పడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, డీజీపీలు కాపాడాలని కోరారు. డీజీపీ గారు కాల్ మనీ మాఫీయా వల్ల ప్రజలు పడే ఇబ్బందులు ఈ రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ మీకే తెలుసు కాల్ మ‌నీ మాఫీయా బారిన పేద ప్రజలు పడకుండా కాపాడండి సార్ అంటూ సీఎం వైఎస్ జగన్ ను సైతం ట్యాగ్ చేశారు. కాల్ మ‌నీ వ్య‌వ‌హారంలో బుద్దా వెంక‌న్న సోద‌రుడి ప్ర‌మేయం పైన అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి. తిరిగి వాటిని విచారించాలి..ప్ర‌భుత్వం పైన ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతోనే కేశినేని నాని తిరిగి ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీద‌కు తెచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇక‌..ఇప్పుడు ముఖ్య‌మంత్రి..డీజీపీ ఈ వ్య‌వహారంలో ఏ ర‌కంగా స్పంది స్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
TDP MP Kesineni Nani tweet asked CM and DGP to action against Call money cases. He indirectly target Budha in this matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X