వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ సాయి రెడ్డిది రాజ్యాంగ ఉల్లంఘ‌న‌: అర్హ‌త కోల్పోయారు: అన‌ర్హ‌త వేటు త‌ప్ప‌దు..!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి..రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య సాయిరెడ్డి ల‌క్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. ఆయ‌న‌కు గ‌త నెల‌లో ఢిల్లీలో ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తేక ప్ర‌తినిధిగా నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే, రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న వ్య‌క్తి మ‌రో లాభ‌దాయ‌క ప‌ద‌విలో కొన‌సాగ‌టానికి వీల్లేద‌నే అభ్యంత‌రాలు తెర మీదకు వ‌చ్చాయి. దీంతో..ఆయ‌న నియామ‌క జీవో ర‌ద్దు చేసి..ఆ త‌రువాత ఆర్డినెన్స్ ద్వారా చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌తో కొత్త జీవో ద్వారా తిరిగి నియ‌మించారు. ఇప్పుడు ఇదే ఆయ‌న పైన అన‌ర్హ‌త వేటుకు కార‌ణ‌మనే ఫిర్యాదులు మొద‌ల‌య్యాయి.

మరో టీడీపీ నాయకుడిపై దాడి ..జగన్ కార్యకర్తలను కంట్రోల్ చెయ్యలేని అసమర్ధులా .. లోకేష్ ఫైర్ <br>మరో టీడీపీ నాయకుడిపై దాడి ..జగన్ కార్యకర్తలను కంట్రోల్ చెయ్యలేని అసమర్ధులా .. లోకేష్ ఫైర్

సాయిరెడ్డి అర్హ‌త కోల్పోయారు...

సాయిరెడ్డి అర్హ‌త కోల్పోయారు...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంతోనే రాజ్యసభ సభ్యత్వానికి అర్హత కోల్పో యారని టీడీపీ ఎంపీలు వాదిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102 ప్రకారం లాభదాయక పదవి చేపడితే రాజ్యసభ సీటుకు అనర్హుడవుతాడని.. ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాపర్టీ కింద ఆయన రాజ్యసభ సభ్యత్వం వదులుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ విష‌యం తెలిసే అన‌ర్హ‌త వేటు భ‌యంతో సాయిరెడ్డిని కాపాడేందుద‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 4న పాత జీవోను ర‌ద్దు చేసింద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. అయితే, ఆర్డినెన్స్ ద్వారా జ‌గ‌న్ ప్ర‌భుత్వం తిరిగి సాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఒక వ్య‌క్తి కోసం ఆర్డినెన్స్ తేవ‌టం పైనా టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేసారు. ఇక‌, ఇప్పుడు టీడీపీ నేత‌లు ఇదే అంశం పైన రాష్ట్రప‌తికి లేఖ రాసారు. సాయిరెడ్డి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగే అర్హ‌త కోల్పోయార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అన‌ర్హ‌త వేటు వేయండి..

అన‌ర్హ‌త వేటు వేయండి..

రాష్ట్ర ప్ర‌భుత్వం తాజా ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ప‌ద‌వి లాభ‌దాయ‌క హోదా నుండి త‌ప్పిస్తూ ప్ర‌త్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీని ఆధారంగా సాయిరెడ్డిని తిరిగి ఢిల్లీలో ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా నియ‌మి స్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి మొత్తం విష‌యాన్ని టీడీపీ ఎంపీలు రాష్ట్రప‌తికి రాసిన లేఖ‌లో వివ‌రించారు. నియ‌మిస్తూ తొలుత జారీ చేసిన జీవోకు..నియామ‌కం ర‌ద్దు చేసిన జీవో తేదీల‌కు మ‌ధ్య 13 రోజుల స‌మ‌యం ఉంద‌ని..ఆయ‌న ఆ స‌మ‌యంలో రెండు ప‌ద‌వుల్లో ఉన్న కార‌ణంగా ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కంటిన్యూ అయ్యే అవ‌కాశం కోల్పోయార‌ని టీడీపీ ఎంపీలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశం పైన రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌గా ఉన్న ఉప రాష్ట్రప‌తికి సైతం మ‌రో ఫిర్యాదు పంపాల‌ని నిర్ణ‌యించారు. మంత్రి పదవులు, స్పీకర్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లు-సభ్యులు లాంటి పదవులు శాసనసభ విధుల్లో భాగం కాబట్టి వాటిని లాభదాయకం కింద చూడొద్దని ఒక జాబితా ఖరారు చేశారు.

 ఉల్లంఘ‌న జ‌ర‌గలేదు..

ఉల్లంఘ‌న జ‌ర‌గలేదు..

ఇదే స‌మ‌యంలో వైసీపీ నేత‌లు మాత్రం త‌మ చ‌ర్య‌ను స‌మ‌ర్దించుకుంటున్నారు. విజ‌యసాయి రెడ్డిని తొలుత నియ‌మిస్తూ జీవో చేసినప్ప‌టికీ..సాయిరెడ్డి ఏపీ భ‌వ‌న్‌లో బాధ్య‌త‌లు స్వీక‌రించ‌లేద‌ని.. వైసీపీ నేత‌లు చెబుతున్నారు. సాయిరెడ్డి మీద ఫిర్యాదు ఇచ్చినా.. రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మాచార లోపంతో ముందుగా జీవో ఇచ్చింద‌ని..త‌రువాత దానిని స‌రిదిద్దుకొనేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మ‌రో సారి జీవో ఇచ్చింద‌ని వివ‌రిస్తున్నారు. దీని ద్వారా సాయిరెడ్డి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి ఎటువంటి ఇబ్బంది లేద‌ని వైసీపీ నేత‌లు వాదిస్తున్నారు.

English summary
TDP MP's complaint to President on YCP MP Vijaya Sai Reddy and demand for disqualify him. In complaint stated that Vijaya Sai reddy nominated as special representative in Delhi along with Rajyasabha member.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X