విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైల్వే జోన్ కోసం ఈనెల 4 న టిడిపి ఎంపీల దీక్ష:చినరాజప్ప

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం:టిడిపి నేతలు విమర్శల జోరు పెంచారు. పవన్ కల్యాణ్ మాట్లాడేముందు ఉత్తరాంధ్ర సమస్యలు తెలుసుకొని మాట్లాడాలని హోమంత్రి చినరాజప్ప హితవు పలికారు. రైల్వే జోన్ కోసం ఈనెల 4న టీడీపీ ఎంపీలు దీక్ష చేయనున్నట్లు చినరాజప్ప ప్రకటించారు.

Recommended Video

కేంద్రం, జగన్ నాటకాలంటూ చంద్రబాబు ఆగ్రహం

మరోవైపు జిఎస్టీ వల్ల రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయంటూ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. దళిత వర్గాలకు టిడిపిపై ఉన్న ప్రేమ ఏంటో దళిత తేజం సభ విజయవంతం అయిన తీరు వల్ల అర్థమవుతోందని టిడిపి నేత వర్ల రామయ్య చెప్పారు. ఇదిలావుంటే టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది.

పవన్ ది...ఎవరో రాసిన స్క్రిప్ట్

పవన్ ది...ఎవరో రాసిన స్క్రిప్ట్

విశాఖలో ఆదివారం హోం మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో టిడిపి ప్రజాప్రతినిథుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రైల్వే జోన్ కోసం ఈనెల 4న టీడీపీ ఎంపీలు దీక్ష చేస్తారని ప్రకటించారు. దీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర సమస్యలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడాలని చిన రాజప్ప హితవుచెప్పారు. ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని విమర్శించారు.

జిఎస్టీ...పొలిటికల్ ప్రాబ్లెమ్స్

జిఎస్టీ...పొలిటికల్ ప్రాబ్లెమ్స్

జీఎస్టీ అమలులో ఆదాయం పరంగా సమస్యలు లేకపోయినా పొలిటికల్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విశ్లేషించారు. ఒక తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. జీఎస్టీ కాన్సెప్ట్ అనగానే విదేశాల్లో అమలు చేసిన తీరులో ఎంతో పకడ్జందీగా అమలు చేస్తారని భావించామని, కానీ దాన్ని నీరుగార్చారని మంత్రి యనమల అన్నారు.

దళితతేజంతో...వణుకు

దళితతేజంతో...వణుకు

నెల్లూరులో జరిగిన దళిత తేజం సభ విజయవంతంతో విపక్షాల్లో వణుకు మొదలైందని ఆర్టీసి చైర్మన్‌ వర్ల రామయ్య చెప్పారు. దళిత వర్గాలకు టిడిపిపై ఉన్న ప్రేమ దళిత తేజం సభ విజయవంతంతో విపక్షాలకు అర్ధమైందని అన్నారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత వర్గాలను అక్కున చేర్చుకున్నదీ టిడిపినేనని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. అమరావతిలో దళిత పార్లమెంట్‌ను చంద్రబాబు త్వరలో ఏర్పాటు చేయిస్తారని వర్ల రామయ్య తెలిపారు.

టిడిపిలోకి...టిటిడి మాజీ సభ్యుడు

టిడిపిలోకి...టిటిడి మాజీ సభ్యుడు

టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ టిడిపి చేరేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామికి స్నేహితుడైన ఓవి రమణ, కుమార స్వామి సిఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబుతో తన అభీష్టాన్ని వ్యక్తపరిచినట్లు టిడిపి శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటక కోటా కింద 2006లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఓవీ రమణ నియమితులయ్యారు. ఆ తర్వాత కొంతకాలం జేడీఎస్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన ఇటీవల రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. ఈనెల 14వ తేదీ దేవెగౌడ, కుమారస్వామి తిరుమల స్వామి వారి దర్శనానికి వస్తున్నట్టు తెలిసింది. ఆ సందర్భంలో వారు ఓవీ రమణ ఇంటిలోనే బస చేసి...టిడిపిలో ఆయన చేరిక విషయం చంద్రబాబుతో ఫోనులో మాట్లాడే అవకాశం ఉ:దంటున్నారు.

English summary
Visakhapatnam:AP home minister Chinnarajappa announced that TDP MPs will do deeksha for on the 4th of this month for the railway zone. On the other hand, Minister Yanamala Ramakrishnudu criticized the GST implementation in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X