వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లాం, పిల్లలుంటే తెలిసేది: మోడీపై జేసీ తీవ్రవ్యాఖ్యలు, 'చంపుతారా.. చైనా, రష్యాలా ఉంది'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి. పైచేయి కోసం టీడీపీ, వైసీపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమరణ దీక్ష చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆదివారం ప్రధాని మోడీ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష, మరోవైపు టీడీపీ ఎంపీల ఆందోళన.. ఇలా డిల్లీలో ఇరు పార్టీలు పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

వైసీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ ఎంపీలను మరో రెండు రోజులు ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించినట్లుగా పలువురు భావిస్తున్నారు. ఎంపీలు ఏపీకి బయలుదేరి చంద్రబాబు ఆదేశాలతో వెనక్కి వెళ్లినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం తిరిగి వెళ్లినవారు ఆదివారం ప్రధాని నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఢిల్లీ పర్యటనకు వచ్చారు.

ప్రధాని మోడీ నివాసం ఎదుట టీడీపీ ఎంపీల ధర్నా, హల్‌చల్, అరెస్ట్ప్రధాని మోడీ నివాసం ఎదుట టీడీపీ ఎంపీల ధర్నా, హల్‌చల్, అరెస్ట్

పెళ్లాం, పిల్లలుంటే తెలిసేది.. జేసీ

పెళ్లాం, పిల్లలుంటే తెలిసేది.. జేసీ

తమను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రతి రాష్ట్రాన్ని గోద్రాలా మార్చాలని చూస్తున్నారన్నారు. పెళ్లాం, పిల్లలు ఉన్నవాళ్లకు ఏపీ ఆందోళనలు అర్థమవుతాయన్నారు. ప్రేమ, కుటుంబం లేని వ్యక్తి మోడీ అన్నారు. ఆయనది లెక్కలేనితనం అన్నారు. కనీసం భార్యాపిల్లలు లేకున్నా ఇద్దరిని దత్తత తీసుకున్నా కుటుంబం విలువ తెలిసేదన్నారు. మోడీ కర్కోటక హృదయుడు అన్నారు. హింస.. హింస.. అని ధ్వజమెత్తారు.

మా గొంతు నొక్కుతారా.. మురళీ మోహన్

మా గొంతు నొక్కుతారా.. మురళీ మోహన్

చాలా అనైతికంగా విభజన జరిగిందని, ఆ సమయంలో ప్రధాని మోడీ హామీలు ఇచ్చారని, వాటినే అమలు చేయమని అడుగుతున్నామని, ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నిస్తే ఇలా వ్యవహరిస్తారా అని మురళీ మోహన్ అన్నారు. తాము ప్రధాని నివాసం వద్ద నిరసన వ్యక్తం చేయాలని వచ్చామన్నారు. తమ రాష్ట్రానికి న్యాయం చేయమంటే అరెస్టు చేస్తున్నారన్నారు. మా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు.

గొంతుచించుకున్నా మోడీ మాట్లాడలేదు.. రామ్మోహన్‌నాయుడు

గొంతుచించుకున్నా మోడీ మాట్లాడలేదు.. రామ్మోహన్‌నాయుడు

ఏపీకి న్యాయం చేయాలని పార్లమెంటులో గొంతు చించుకున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. కానీ ప్రధాని మాత్రం ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఎంపీలం అని కూడా చూడకుండా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధాని స్వయంగా దీనిపై స్పందించాలన్నారు. 30 రోజుల నుంచి పార్లమెంటులో తాము గొంతు చించుకుంటున్నామన్నారు. ఇది సరికాదన్నారు. ఏపీకి న్యాయం చేయాలని, దీనిపై ప్రధాని మాట్లాడాలన్నారు. మోడీకి అన్ని విషయాలు తెలుసునని చెప్పారు. ఎంపీలు అని చూడకుండా అదుపులోకి తీసుకుంటారా అన్నారు. వీ వాంట్ జస్టిస్ అని నినాదం చేశారు.

చైనా, రష్యాలా ఉంది.. గల్లా జయదేవ్

చైనా, రష్యాలా ఉంది.. గల్లా జయదేవ్

కేంద్రం తమను పట్టించుకోవడం లేదని గల్లా జయదేవ్ అన్నారు. పార్లమెంటులో పట్టించుకోకపోవడంతో ప్రధాని నివాసం వద్దకు వచ్చి ఆందోళన తెలుపుతున్నామన్నారు. ప్రశాంతంగా తాము నిరసన తెలిపితే దానికి కూడా అనుమతించకుండా ఇలా చేస్తే ఎలా అన్నారు. ఇది భారత్ వలె లేదని, చైనా, రష్యా మాదిరి ఉందన్నారు.

చంపుతారా, బెదిరిస్తారా, అడుగుతున్నామని బుట్టా రేణుక

చంపుతారా, బెదిరిస్తారా, అడుగుతున్నామని బుట్టా రేణుక

ప్రజాస్వామ్యయుతంగా ప్రధాని నరేంద్ర మోడీని కలుద్దామని అనుకున్నామని, కానీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, తదుపరి కార్యాచరణ ఆలోచిస్తామని సుజనా చౌదరి అన్నారు. ఎంపీలమని చూడకుండా ఈడ్చుకెళ్తారా అన్నారు. తమను ఎత్తి లోపల పడేశారని, బెదిరిస్తారా, చంపుతారా.. దేనికైనా సిద్ధమని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. పార్లమెంటులో పెట్టిన బిల్లును అమలు చేయమని అడిగితే వెనుకాడుతున్నారని బుట్టా రేణుక అన్నారు.

నిషేధిత ప్రాంతమని చెప్పిన వినని ఎంపీలు, లాగేశారు

నిషేధిత ప్రాంతమని చెప్పిన వినని ఎంపీలు, లాగేశారు

కాగా, ప్రధాని నివాసం ఎదుట భద్రతా వలయాన్ని దాటుకొని టీడీపీ ఎంపీలు లోపలకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బలవంతంగా వారిని తరలించారు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు లాగారు. ప్రధాని ఇంటి ముట్టడికి టీడీపీ ఎంపీలు యత్నించగా, వారి నిరసనల గురించి ముందుగానే తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించడంతో పాటు ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎంపీలు అశోక్ గజపతిరాజు, గల్లా జయదేవ్, సీఎం రమేష్, మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు తదితరులంతా ప్రధాని నివాసం వద్దకు చేరుకోగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. అది నిషేధిత ప్రాంతమని నచ్చజెప్పినా ఎంపీలు వినక పోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని బస్సులో అక్కడి నుంచి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషనుకు తరలించారు.

English summary
TDP MPs detained as they staged protest outside prime minister's residence at Lok Kalyan Marg over demand of special category status for Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X