వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్‌పై అమిత్ షానకు టీడీపీ ఎంపీల కంప్లైట్: అచ్చెన్న అరెస్టు..పట్టాభిపై దాడి

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో ఒకే రోజు చోటు చేసుకున్న సంఘటనల పట్ల తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. ఒకవంక- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అరెస్ట్.. అదే రోజు జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై చోటు చేసుకున్న దాడుల పట్ల పార్టీ నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. కారణాలు ఏమైన్పటికీ.. ఈ రెండు సంఘటనలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ నిప్పులు చెరుగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి వైఎస్సార్పీపీ ప్రభుత్వం భౌతిక దాడులకు దిగుతోందంటూ ఆరోపిస్తున్నారు.

బియ్యం బండిని నడిపిన నిమ్మగడ్డ: త్వరలో హైకోర్టుకు వివరాలు: వైఎస్ జగన్ ఫొటోపై?బియ్యం బండిని నడిపిన నిమ్మగడ్డ: త్వరలో హైకోర్టుకు వివరాలు: వైఎస్ జగన్ ఫొటోపై?

ఈ పరిణామాల మధ్య టీడీపీ పార్లమెంట్ సభ్యులు..కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకోబోతున్నారు. ఈ సాయంత్రం వారు న్యూఢిల్లీలో అమిత్ షాతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, రాజకీయాల పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది. ఆయా అంశాలతో కూడిన వినతిపత్రాన్ని వారు అమిత్ షానకు అందజేస్తారని సమాచారం. గుంటూరు, విజయవాడ లోక్‌సభ సభ్యులు గల్లా జయదేవ్, కేశినేని నాని, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్.. అమిత్ షాను కలుస్తారని అంటున్నారు.

TDP MPs likely to meet Union Home Minister Amit Shah today evening

శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు పితృత్వ సెలవుల మీద ఉన్నందున.. ఢిల్లీకి వెళ్లలేదని సమాచారం.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతుండటం, ఎన్నికలు జరగనివ్వకుండా ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నారని, ఇందులో భాగంగా నామినేషన్ వేయదలిచిన ప్రత్యర్థి పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులపై దాడులు, కిడ్నాప్‌కు దిగుతున్నారనే విషయాన్ని టీడీపీ ఎంపీలు.. అమిత్ షానకు వివరిస్తారని సమాచారం.

అలాగే- తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో టీడీపీ బలపర్చిన సర్పంచి అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాసరెడ్డిని కిడ్నాప్, హత్యోదంతాన్ని వారు అమిత్ షానకు వివరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా అంశాలతో కూడిన వినతిపత్రాన్ని వారు అమిత్ షా అంజేస్తారని ప్రచారం సాగుతోంది. రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించాలని వారు అమిత్ షాను కోరుతారని అంటున్నారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంస ఘటనలను కూడా వారు అమిత్ షానకు వివరించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది.

English summary
Telugu Desam Party Members of Parliament likely to meet Union Home Minister Amit Shah shortly at New Delhi. They will reportedly give a memorandum to Amit Shah current political scenario in the State of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X