వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షాతో టీడీపీ ఎంపీలు... ధన్యవాదాలు తెలిపిన నేతలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ ఎంపీలు , బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, సీతారామలక్ష్మి, రవీంద్రకుమార్ అమిత్ షాను కలిసిన వారిలో ఉన్నారు. అయితే వారి భేటి మర్యాదపూర్వకంగానే జరిగిందని ఎంపీలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమరావతిని ఇండియా మ్యాప్‌లో చేర్చినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం రాష్ట్ర పరిస్థితులపై సమావేశం అయ్యోందుకు అవకాశం ఇవ్వాలని అమిత్ షాను కోరినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అయితే ఎంపీలు ఎప్పుడు వచ్చినా...తనను కలుసుకోవచ్చని అమిత్ హామీ ఇచ్చినట్టు చెప్పారు.

 Tdp mps meet central home minister amit shah

కొన్ని రోజుల క్రితం సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన భారతదేశ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేకపోవడంతో రాజకీయంగా దుమారం రేపింది. దీంతో టీడీపీపై తీవ్ర ప్రభావం పడింది. ఆ పార్టీ చేసిన అభివృద్ది, అమరావతి నిర్మాణం చేసిన కృషి పలు విమర్శలు ఎదుర్కోన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో ప్రస్తావించారు. స్యయంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన అమరావతి నిర్మాణం మ్యాప్‌లో లేకపోవడం పై ఆయన ప్రశ్నించారు. దీంతో స్పందించిన కేంద్రం మ్యాప్‌లో అమరావతికి చోటు కల్పించింది.

English summary
Andhra Pradesh Tdp mps meet central home minister amit shah, said thanks for adding amaravathi in country map.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X