వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుజనా, అశోక్ డుమ్మా: నోరు విప్పని చంద్రబాబు, రాజ్‌నాథ్‌తో ఎంపీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగడంపై తెలుగుదేశం పార్టీ వైఖరిపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, అందుకే టిడిపి పోరాటం చేస్తోందని రాష్ట్ర మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు.

Recommended Video

TDP Retains Alliance With BJP But Ready To Put Pressure On Centre

ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడకపోవడంపై మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు - బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మంత్రులూ ఎంపీల వద్ద ప్రస్తావించారని ఆయన సమాధానం చెప్పారు.

 నిరసనకు టిడిపి కేంద్ర మంత్రులు డుమ్మా

నిరసనకు టిడిపి కేంద్ర మంత్రులు డుమ్మా

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ ఎెంపీలు చేపట్టిన నిరసనకు కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు దూరంగా ఉన్నారు. వేరే పనుల్లో మునిగిపోయి, తీరిక లేకపోవడం వల్లనే వారు నిరసనలో పాల్గొనలేదని కాలువ శ్రీనివాసులు చెప్పారు.

అందువల్లనే గైర్హాజరు..

అందువల్లనే గైర్హాజరు..

మంత్రులుగా ఉంటూ తమ ప్రభుత్వంపైనే నిరసన వ్యక్తం చేసినట్లు అవుతుందని, దానివల్ల విమర్శలు వస్తాయని భావించి సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పదవులకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉండవచ్చునని వారు భావించినట్లు తెలుస్తోంది. ధర్నాకు రాకపోవడంపై వారు పెదవి విప్పలేదు.

 రాజ్‌నాథ్‌తో భేటీకి మాత్రం వచ్చారు...

రాజ్‌నాథ్‌తో భేటీకి మాత్రం వచ్చారు...

రాజ్‌నాథ్‌తో తెలుగుదేశం పార్టీ పార్లమెంట సభ్యుల భేటీలో మాత్రం సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు ఉన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని, ఏడాదిలోగా అన్ని హమీలు అమలయ్యేలా చూడాలని వారు రాజ‌్‌నాథ్ సింగ్‌ను కోరారు.

రాజ్‌నాథ్‌తో ఈ విషయాలు..

రాజ్‌నాథ్‌తో ఈ విషయాలు..

విభజన చట్టంలోని హామీలను పెండింగ్ అంశాలను తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని వారు మంత్రి దృష్టికి తెచ్చారు.

English summary
Telugu Desam party MPs along with union ministers Sujana Chowdary and Ashok Gajapathi Raju met union minister Rajanth Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X