వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనుసైగ చేస్తే: మురళీ మోహన్ సంచలనం, తొందరపడడని జేసీ, బాబుకు అమిత్ షా ఫోన్?

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆదివారం భేటీ అయింది. ముఖ్యమంత్రీ నారా చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిన నేపథ్యంలో కేంద్రంపై ఎలా ఒత్తిడి పెంచాలనే విషయమై చర్చించారు. రాజీనామా చేయాలని కొందరు, ఆచితూచి వ్యవహరించాలని మరికొందరు సూచించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, ఎంపీ సీఎం రమేష్ గైర్హాజరయ్యారు.

జేసీకి సమావేశం సమయంలో జేసీ దివాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి పడిపోవడంతో వైద్యులు పరిశీలించారు. బీపీ, షుగర్ లెవల్స్ పరీక్షించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన అవసరం లేదని చెప్పారు. కాగా, భేటీకి ఎంపీలతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షులు, పయ్యావుల కేశవ్ వంటి సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. రాజీనామా చేద్దామని కొందరు అంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు అభిప్రాయ సేకరణ

చంద్రబాబు అభిప్రాయ సేకరణ

చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. ఆదివారం ఎంపీల అభిప్రాయం తీసుకున్నారు. ఈ భేటీ తర్వాత కీలక నిర్ణయం వెలువడే అవకాశముందని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. భేటీ సమయంలో, భేటీలో చంద్రబాబు వద్ద ఎంపీలు పలు అంశాలను కుండబద్దలు కొట్టారు. పొత్తు కొనసాగిద్దామా వద్దా అని ఆయన అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

బాబును తిడుతున్నారు: పరిటాల సునీత, పురంధేశ్వరి సహా అమిత్ షా వార్నింగ్బాబును తిడుతున్నారు: పరిటాల సునీత, పురంధేశ్వరి సహా అమిత్ షా వార్నింగ్

అణిగిమణిగి ఉంటే.. మురళీ మోహన్ తీవ్ర వ్యాఖ్యలు

అణిగిమణిగి ఉంటే.. మురళీ మోహన్ తీవ్ర వ్యాఖ్యలు

బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగినందున వెంటనే నిర్ణయం తీసుకోల్సిన సమయం వచ్చిందని మురళీ మోహన్ అన్నారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తాము ముందుకు పోతామని చెప్పారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెబుతామన్నారు. అణిగిమణిగి ఉంటే వారు (కేంద్రంలోని బీజేపీ) లెక్క చేయడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ దెబ్బ, బాబు డైలమా.. బడ్జెట్‌పై ఇదీ వ్యూహం! అశోక్-సుజనల రాజీనామా, ట్విస్ట్జగన్ దెబ్బ, బాబు డైలమా.. బడ్జెట్‌పై ఇదీ వ్యూహం! అశోక్-సుజనల రాజీనామా, ట్విస్ట్

చంద్రబాబు తొందరపడే సీఎం కాదని జేసీ

చంద్రబాబు తొందరపడే సీఎం కాదని జేసీ


ఏపీకి కేంద్రం పంగనామాలు పెట్టిందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కేంద్రంపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. అటో ఇటో తేల్చుకుంటామని చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తామని చెప్పారు. సీఎంకు అన్ని విషయాలు వివరిస్తామని చెప్పారు. చంద్రబాబు తొందరపడే సీఎం కాదని, తమ అభిప్రాయాలు చెప్పామన్నారు.

రాజీనామాలకు సిద్ధం

రాజీనామాలకు సిద్ధం

ఏపీకి అదనంగా కేంద్రం ఇవ్వాలని తాము అడగడం లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నామని ఎంపీలు టీజీ వెంకటేష్, అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులు అన్నారు. హోదా లేదు, ప్యాకేజీ లేదు, వాటికి నిధులూ లేవని వాపోయారు. రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం చేస్తారా లేదా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల ముందు రాజీనామా చాలా చిన్నదని చెప్పారు. చంద్రబాబు ఆదేశిస్తే రాజీనామాలకు సిద్ధమని చెప్పారు.

కత్తీ, డాలు సిద్ధమని శివప్రసాద్

కత్తీ, డాలు సిద్ధమని శివప్రసాద్

చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు సిద్ధమని ఎంపీ శివప్రసాద్ అన్నారు. కత్తి, డాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తాము క్రమశిక్షణ కలిగిన సైనికులమని చెప్పారు. చంద్రబాబు కనుసైగ చేస్తే కత్తి తీయడానికి రెడీగా ఉన్నామని, మిత్రపక్షంగా ఉండి పోరాడుదామని చంద్రబాబు ఆదేశిస్తే అలాగే చేస్తామన్నారు. పార్టీ భావాలు, అభిప్రాయాలను పాటిస్తామన్నారు.

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్?

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్?

కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం ఇస్తారా లేదా చూస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో స్నేహంగా ఉంటూ రాష్ట్రానికి కావాల్సింది సాధిస్తామని మరికొందరు ఎంపీలు చెబుతున్నారు. ఏపీకి న్యాయం చేస్తే జిందాబాద్ లేదంటే సెల్యూట్ చెబుతామని అంటున్నారు. కాగా, చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఫోన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

English summary
Telugu Desam Party MPs ready to resign if Chief Minister Nara Chandrababu order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X