వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను జాతీయ స్థాయికి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది : చ‌ంద్ర‌బాబు వ్యాఖ్య‌ల ప‌ర‌మార్ధం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..! | Oneindia Telugu

ఏపి ముఖ్య‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. కొద్ది రోజుల‌గా జీతీయ రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న టిడిపి అధినేత చంద్ర‌బాబు..ఇప్పుడు ఏకంగా తాను జాతీయ స్థాయిలో ప‌ని చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని వ్యాఖ్యానించారు. సీయం వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు ఏపిలో కొత్త చ‌ర్చ మొద‌లైంది. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలోనూ...త‌న‌కు గ‌తంలోనే రెండు సార్లు ప్ర‌ధానిగా అవ‌కాశం వ‌చ్చినా..వెళ్ల‌లేద‌ని..ఇప్పుడూ ఏపి పైనే దృష్టి అని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా చేసిన ఈ వ్యాఖ్య‌ల పై అనేక ర‌కాలైన అంచ‌నాలు వినిపిస్తున్నాయి.

అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు కార‌ణ‌మ య్యాయి. టీడీపీ జాతీయస్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తాను జాతీ యస్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రత్యర్థులు అసత్య ఆరోపణలు చేస్తే తిప్పికొట్టాల్సిందే అని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలను తిప్పికొట్టానని తెలిపారు.

TDP and myself work for National Politics : AP C.M Chandra Babu

ప్రతిపనికి దూరదృష్టి అవ సరమన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి ఆనాడు దార్శనికత రూపొందించి కృషిచేశానని చెప్పారు. గ్రాండ్ హైదరాబాద్‌కు విజన్ ఇచ్చానని.. అంగుళం అంగుళం అభివృద్ధి చేశానని తెలిపారు. నగరాన్ని నాలెడ్జ్ ఎకానమీగా అభివృద్ధి చేశామని బాబు అన్నారు. ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం పైనా ముఖ్య‌మంత్రి కీల‌క కామెంట్లు చేసారు.

మోదీ నిరాశ‌కు గురి చేసారు..
కేంద్ర ప్ర‌భుత్వం ఏపి తో వ్య‌వ‌హ‌రించిన తీరు పైనా ముఖ్య‌మంత్రి మ‌రోసారి త‌న ఆవేద‌న వెలిబుచ్చారు. తాను.. ఏపి ప్ర‌జ‌లు మోదీపై ఎంతో నమ్మకం పెట్టుకుని నిరాశకు గురయ్యారన్నారు. ప్రజల నమ్మకాన్ని మోదీ వమ్ముచేశారని విమర్శించారు. మాటలకు, చేతలకు పొంతన లేకుండా పాలన సాగిస్తే ప్రజల్లో అసహనం పెరుగుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కాంగ్రెస్ హయాంలోనే గుర్తింపు వచ్చిందని తెలిపారు. పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని ప్రణాళిక సంఘం సిఫారసు చేసిందని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన అనేక ప‌ధ‌కాల నిర్వ‌హ‌ణ‌..ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల గురించి చంద్ర‌బాబు వివ‌రించారు.

English summary
AP C.M Chandra Babu Naidu analysed his necessity in National Politics. He stated that he have to work in national level. C.M comments in collectors conference created hot topic in political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X