వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై నమ్మకం పోయింది: అసెంబ్లీలో ప్రసంగంపై లోకేష్ ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత నారా లోకేష్ మండిపడ్డారు. న్యాయవ్యవస్థ, మీడియా, స్పీకర్ పై, టీడీపీ ప్రభుత్వంపై జగన్‌కు నమ్మకం లేదని ఆయన ఆరోపించారు.

TDP Nara Lokesh fires at YS Jagan

అసెంబ్లీలో జగన్ మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్లు చేశారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా ఆయన మాట్లాడారన్నారని మండిపడ్డారు. జగన్‌పై ప్రజలకు విశ్వాసం పోయిందని, ఆ విషయాన్ని ఆయన గ్రహించాలని లోకేష్ అన్నారు.

శాసనసభ రేపటికి వాయిదా

ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ పై ప్రతిపక్షం వైయస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాసం తీర్మానం వీగిపోయింది. అనంతరం కోడెల ప్రసంగించారు. తనపై అవిశ్వాసం పెట్టడం కొంత బాధ కల్గించిందని అన్నారు.

అవిశ్వాసం వీగిపోయేలా తనకు మద్దతుగా నిలిచిన సభ్యులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తన జీవితం గురించి, ఆయన వైద్యుడవటానికి గల కారణాలు, వైద్య వృత్తి జీవితం, రాజకీయాల్లోకి ప్రవేశించడం మొదలైన విషయాలను కోడెల ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు స్పీకర్ కు సంఘీభావం తెలిపారు. అనంతరం సభ రేపటికి వాయిదాపడింది.

English summary
Telugudesam Party leader Nara Lokesh on Tuesday fired at YSR Congress Party president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X