వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇసుక కొట్టేస్తే నో సీఐడీ..మహిళలను వేధిస్తోంటే నో సీఐడీ: బాలయ్య డైలాగులను పేల్చిన నారా లోకేష్

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. ఈ సారి సీఐడీ విభాగాన్ని తన టార్గెట్‌గా చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో సీఐడీ విభాగం కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా విభాగంలా సీఐడీ తయారైందని విమర్శించారు. ఈ క్రమంలో ఆయన నందమూరి బాలకృష్ణ డైలాగులను వల్లె వేశారు. సీఐడీ అధికారుల అదుపులో ఉన్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని నారా లోకేష్ భరోసా కల్పించారు.

సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిపై అనుచిత కామెంట్లు, పోస్టులు చేస్తోన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను సీఐడీ అధికారులు తరచూ నోటీసులను జారీ చేస్తోన్న విషయం తెలిసిందే. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సీఐడీ అధికారులు. తాజాగా కృష్ణ, కిశోర్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదే నారా లోకేష్ ఆగ్రహానికి కారణమైంది. తమ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తప్పు పడుతున్నారు.

TDP National General Secretary Nara Lokesh criticising to AP CID department

అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార పార్టీ అనేక విధాలుగా రాష్ట్రాన్ని దోచుకుంటోందని, అయినప్పటికీ.. ఏనాడూ సీఐడీ అధికారులు స్పందించిన దాఖలాలు లేవని నారా లోకేష్ ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, వారిపై ఏనాడైన చర్యలు తీసుకున్నారా? అని నిలదీశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నప్పటికీ.. స్పందించని సీఐడీ అధికారులు.. సోషల్ మీడియా భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు.

Recommended Video

Rajya Sabha Elections 2020 : AP 4 Rajya Sabha Seats Won By YSRCP

విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని వైసీపీ నాయకులు ప్రజలకు అమ్ముతున్నారని, జే ట్యాక్స్ పేరుతో మద్యం తయారీ కంపెనీల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. 108 అంబులెన్స్ వ్యవహారంలో భారీ కుంభకోణాన్ని తాము వెలికి తీస్తే.. సీఐడీ అధికారులు ఎందుకు చర్యలను తీసుకోలేకపోతున్నారని నిలదీశారు. రాజారెడ్డి రాజ్యాంగంలో సీఐడీ విభాగం వైసీపీ నాయకుల సోషల్ మీడియా వింగ్‌గా మారిందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే హక్కు వారికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

English summary
Telugu Desam Party National General Secretary and former Minister Nara Lokesh strongly criticising to Andhra Pradesh CID department Police. He alleged that CID Police arresting our Party leaders for baseless allegations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X