వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండలిలో టీడీపీ ట్విస్ట్..తీర్మానం: మా ఎమ్మెల్సీలకు ఫోన్లు చేస్తారా: బొత్సా వర్సెస్ యనమల..!

|
Google Oneindia TeluguNews

శాసనమండలిలో ప్రారంభంలోనే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సభ ప్రారంభం కాగానే మూడు రాజధానులు..వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన ప్రతిపాదనకు సిద్దమయ్యారు. ఆ సమయంలో ప్రతిపక్ష టీడీపీ నుండి ఊహించని విధంగా కొత్త ప్రతిపాదన ఎదురైంది. బిల్లు కంటే ముందుగా తాము రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చామని..దీని మీద తొలుత చర్చ చేపట్టాలని టీడీపీ పట్టు బట్టింది. ప్రభుత్వ విధానం మొత్తం తప్పుగా వ్యవహరిస్తోందని..దీని మీద చర్చ జరిగిన తరువాతనే బిల్లు మీద చర్చ తీసుకోవాలని మండలిలో ప్రతిపక్ష నేత యనమల డిమాండ్ చేసారు. అయితే, దీనికి మంత్రి బుగ్గన అభ్యంతరం వ్యక్తం చేసారు. అసలు యనమల ప్రస్తావిస్తున్న మోషన్ మండలిలో అమల్లో లేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మంత్రులు..టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

టీడీపీ కొత్త డిమాండ్: ఆర్థిక రాజధానిగా, ఫిల్మ్ ఇండస్ట్రీ క్యాపిటల్‌గా విశాఖ ఓకే: పరిపాలన మాత్రం నో..టీడీపీ కొత్త డిమాండ్: ఆర్థిక రాజధానిగా, ఫిల్మ్ ఇండస్ట్రీ క్యాపిటల్‌గా విశాఖ ఓకే: పరిపాలన మాత్రం నో..

రూల్ 71 కింద టీడీపీ నోటీసు..
శాసన మండలిలో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ప్రతిపాదనకు సిద్దమైంది. అదే సమయంలొ టీడీపీ నుండి రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని.. ప్రభుత్వ పాలసీని వ్యతిరేకిస్తూ తాము ప్రతిపాదించిన తీర్మానం పైన చర్చ చేపట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఆ తరువాతనే ప్రభుత్వ బిల్లులను చర్చకు తీసుకోవాలని టీడీపీ నేతలు ఛైర్మన్ ను కోరారు. బిల్లుల కంటే ముందుగానే తాము నోటీసు ఇచ్చామని..ముందు దీని పైనే చర్చ చేపట్టాలని బిజినెస్ రూల్స్ చెబుతున్నాయని టీడీపీ నేత యనమల వాదిస్తన్నారు. అయితే, యనమల వాదనతో ప్రభుత్వం విభేదించింది. అసలు ఆ నోటీసు మీద చర్చకు మండలికి అవకాశం లేదని మంత్రి బుగ్గన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. దీంతో..మండలిలో ఇదే అంశం మీద ఎవరి వాదన వారు కొనసాగిస్తున్నారు.
తామిచ్చిన నోటీసుపై చర్చ జరగాల్సిందేనంటోన్న యనమల.

TDP new twist in council before govt bill introduce in Legislative council

మా ఎమ్మెల్సీకు ఫోన్లు చేస్తారా..
ఇదే సమయంలో టీడీపీ పక్షనేత యనమల సభా వేదికగా మరో అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీసారు. తమ ఎమ్మెల్సీలకు ప్రభుత్వంలోని ముఖ్యులు ఎందుకు ఫోన్లు చేస్తున్నారని యనమల నిలదీసారు. దీనికి కొనసాగింపుగా శాసన మండలిని కించపరిచే విధంగా బొత్స వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని ప్రస్తావించిన యనమల ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. మండలికి క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేసారు. సభలో టీడీపీకి మెజార్టీ ఉండటంతో..ఖచ్చితంగా ప్రభుత్వ ప్రతిపాదించే బిల్లులకు అడ్డంకులు కలిగిస్తుందని అందరూ అంచనాతో ఉన్నారు. అయితే, రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించ టం..ఇదే సమయంలో బొత్సా ను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా టీడీపీ వ్యూహం అమలు చేస్తోంది. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
TDP issued notice under rule 71 in council before govt bill introduce. TDp floor leader yanamala object govt followed proceedure in three capitals issue in legislature. House stalled on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X