కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు కడపలో చెక్ పెట్టేందుకు బాబు వ్యూహం, తాజా ప్లాన్ ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లాలో వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొనే లక్ష్యంతో చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు.

కడప జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది. అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఆదినారాయణరెడ్డికి చంద్రబాబునాయుడు చోటు కల్పించారు.

ఆదినారాయణరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కక ముందే జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించి టిడిపి అభ్యర్థి బిటెక్ రవి విజయం సాధించారు. ఈ విజయం వైసీపీ శ్రేణుల్లో నిరాశను నింపింది. టిడిపి శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది.2019 ఎన్నికల్లో వైసీపీ కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేలా టిడిపి వ్యూహ రచన చేస్తోంది.

ఆ దారిలోనే టిడిపికి చెక్: అసెంబ్లీలో బిజెపి విపక్ష పాత్రఆ దారిలోనే టిడిపికి చెక్: అసెంబ్లీలో బిజెపి విపక్ష పాత్ర

కడపలో ప్రాబల్యం పెంచుకొనేందుకు టిడిపి ప్లాన్

కడపలో ప్రాబల్యం పెంచుకొనేందుకు టిడిపి ప్లాన్

కడప జిల్లాలో 2019 ఎన్నికల్లో జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని టిడిపి ప్లాన్ చేస్తోంది. వైసీపీకి క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును తగ్గించేందుకు టిడిపి నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు కడప జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరచూ సమావేశాలను నిర్వహిస్తున్నాడు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ పనితీరును అంచనా వేసి రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని టిడిపి ప్లాన్ చేస్తోంది.

కడపలో అభివృద్ది కార్యక్రమాలు

కడపలో అభివృద్ది కార్యక్రమాలు

కడప జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్తున్నారు కడప జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీతో చంద్రబాబునాయుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈ సమావేశాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు దిశా నిర్ధేశం చేస్తున్నారు.ఇందులో ప్రతి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కి గట్టిగానే చంద్రబాబునాయుడు హెచ్చరికలు జారీచేశారని సమాచారం. వచ్చే ఎన్నికల లోపు కడపజిల్లా ప్రజల్లో ఎలాగైనా మార్పు తెచ్చేలా కృషిచేయాలని బాబు ఆదేశించారు.

ఆపరేషన్‌ కడపకు శ్రీకారం చుట్టిన టిడిపి

ఆపరేషన్‌ కడపకు శ్రీకారం చుట్టిన టిడిపి

ఆపరేషన్ కడపకు టిడిపి శ్రీకారం చుట్టింది. కడప జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది. ఈ పట్టును ఎన్నికల సమయం నాటికి ఎంత మేరకు తగ్గించగలిగితే రానున్న ఎన్నికల్లో రాజకీయంగా తమకు ప్రయోజనం కలుగుతోందని భావిస్తోంది. ఈ మేరకు వైసీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకు టిడిపి తమకు అందివచ్చిన ప్రతి అవకాశాలన్ని వాడుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు అన్ని రకాల వ్యూహలను అమలు చేయాలని తలపెట్టింది.

కడపలో సమస్యల పరిష్కారం కోసం కృషి

కడపలో సమస్యల పరిష్కారం కోసం కృషి

కడప జిల్లాలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం టిడిపి నాయకులు చర్యలు చేపట్టారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిదులను మంజూరు చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు హమీ ఇచ్చినట్టు టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది. కడపజిల్లాలోని 10 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ నేతలు ప్రజల్లో తిరిగేందుకు సన్నద్ధమయ్యారు.

English summary
Tdp planning to strengthen party in Kadapa district. Chandarbababu naidu conducting meetings with Kadapa tdp leaders. he directed to party leaders how to strengthening party in kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X