వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడ: రెబెల్స్‌పై వేటుకు టిడిపి సన్నద్దం

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో రెబెల్స్‌పై వేటుకు టిడిపి సన్నద్దంకాకినాడలో పార్టీ నేతలు సమావేశమై నిర్ణయంబిజెపి నేతలతో ఫోన్‌లో మాట్లాడిన టిడిపి జిల్లా అధ్యక్షుడు రాంబాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాకినాడ: కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు గాను టిడిపి, బిజెపి కూటమి పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా బరిలో నిలిచిన రెబెల్స్‌పై వేటేసేందుకు టిడిపి, బిజెపిలు రంగం సిద్దం చేశాయి.

కాకినాడ కార్పోరేషన్‌ ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడురోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో పార్టీలు రెబెల్స్‌పై దృష్టిపెట్టాయి.

Tdp plans to suspension on rebel candidates in Kakinada corporation elections.

పార్టీ నిర్ణయాన్ని కాదని రెబెల్స్‌గా బరిలో దిగిన వారిపై తెదేఏ-భాజపా కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యాయి. పార్టీ కార్యాలయంలో మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, ఎంపీ కొనకళ్ల నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు నామన రాంబాబు సమావేశమయ్యారు.

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ అభ్యర్థులను కాదని రెబెల్స్‌గా బరిలో ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

స్వతంత్రులుగా బరిలోకి దిగిన రెబల్‌ అభ్యర్థులను ఉపేక్షించకుండా ఇరుపార్టీలు ఓ అభిప్రాయానికి వచ్చి వారిని పార్టీ నుంచి తొలగించాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఈ మేరకు భాజపా నేతలతోనూ ఫోన్‌లో మాట్లాడి తెదేపా అభ్యర్థులపై పోటీకి దిగిన భాజపా రెబల్‌ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే తొమ్మిదో డివిజన్‌లో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అప్పలకొండకు... తెదేపాకు ఎలాంటి సంబంధం లేదని నామన రాంబాబు స్పష్టం చేశారు.

English summary
Tdp planning to suspension on rebel candidates in Kakinada corporation elections.Tdp east godavari district president Rambabu phoned to Bjp leaders for withdraw bjp rebel candidates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X