వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ చనిపోయినా: జగన్ మీద మాజీ సీఎస్ రమాకాంత్ షాకింగ్ వ్యాఖ్యలపై టిడిపి

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి పైన రమాకాంత్ సాక్షి ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్ జగన్‌ కేసులో సిబిఐ దర్యాప్తుపై మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన రమాకాంత్ సాక్షి ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టిడిపి భేటీలో చర్చ జరిగింది.

జగన్ కేసు గురించి రమాకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని వారు అభిప్రాయపడ్డారు. వైయస్ చనిపోయాక కేసులో అర్థం లేదని ఆయన అనడాన్ని తప్పుబట్టారు. తమిళనాడులో జయలలిత మృతి చెందినా.. శశికళకు శిక్ష పడిందని ఈ సందర్భంగా చర్చించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినా... వైయస్ మృతి చెందినా, జగన్‌కు శిక్ష పడుతుందని అభిప్రాయపడ్డారు.

ys jagan

జగన్ కేసుపై మాజీ సిఎస్ రమాకాంత్ షాకింగ్: ఇలా ప్రశ్నించానంటూ...జగన్ కేసుపై మాజీ సిఎస్ రమాకాంత్ షాకింగ్: ఇలా ప్రశ్నించానంటూ...

కాగా, సీబీఐకి రాష్ట్ర సచివాలయ రూల్స్ తెలియవని, కేబినెట్ రూల్స్ తెలియవని, మంత్రివర్గ సమావేశం ఎందుకు నిర్వహిస్తారో కూడా తెలియదని రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పారు.

కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి కారణాలు రాయనక్కరలేదని, రూల్స్ తెలుసుకోకుండానే జగన్ కేసుల్లో విచారణ ప్రారంభించారని వ్యాఖ్యానించారు. సచివాలయంలో, క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశాలకు జగన్ రాలేదన్నారు.

విమర్శల పైనా లింక్ : నాడు వైయస్ జగన్‌పై, నేడు శశికళ పైన?విమర్శల పైనా లింక్ : నాడు వైయస్ జగన్‌పై, నేడు శశికళ పైన?

ఫలానా పని చేసి పెట్టాలంటూ జగన్ తనకు ఎన్నడూ లేఖలు రాయలేదని రమాకాంత్ రెడ్డి చెప్పారు. తాను వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాతనే జగన్‌ను కలిశానని చెప్పారు. రమాకాంత్ పై ఇంటర్వ్యూ వ్యాఖ్యల పైన టిడిపి పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది.

ఎమ్మెల్సీగా అసెంబ్లీకి లోకేష్: సోమిరెడ్డి

టిడిపి పొలిట్‌ బ్యూరో సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమావేశం ముగిసిన అనంతరం తెలిపారు. నారా లోకేశ్‌ను ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించామని, త్వరలోనే ఆయన ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెడతారన్నారు.

<strong>తెలుగుదేశం పార్టీ భేటీలో చాన్నాళ్లకు హరికృష్ణ</strong>తెలుగుదేశం పార్టీ భేటీలో చాన్నాళ్లకు హరికృష్ణ

నూతన అసెంబ్లీని మార్చి 2న ప్రారంభించాలని నిర్ణయించామని, విభజన హామీలను చట్టం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని, అన్ని కార్పోరేషన్లలోనూ తొలిదశ ఎన్టీఆర్‌ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

స్థానిక సంస్థల్లో మూడంచెల వ్యవస్థ పునరుద్ధరణపై కేంద్రాన్ని కోరుతామని, ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న కేంద్రం నిర్ణయానికి మద్దతిస్తామని, తెలుగు భాష అభివృద్ధి కోసం సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, అనాథల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

English summary
Telugudesam Politiburo on Sunday discussed on former CM Ramakanth Reddy's comments on YSRCP chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X