వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపటి నుండే టీడీపీ ప్రజా చైతన్య యాత్ర ... కాన్సెప్ట్ అంతా తొమ్మిదే !!

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో వైసీపీ పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి అని భావిస్తున్నమాజీ సీఎం చంద్రబాబు రేపటి నుండి సమర శంఖం పూరిస్తున్నార . వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టటానికి ప్రజల్లోకి వెళ్లాలని తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ అధినేత చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇక ఈ ప్రజా చైతన్య యాత్ర కాన్సెప్ట్ మాత్రం చాలా కొత్తగా రూపొందించారు. ఈ కాన్సెప్ట్ లో ఈ యాత్రలో కీలకమైన అంశాలు చూస్తే

టార్గెట్ జగన్ ..ప్రభుత్వ వైఫల్యాలపై రంగంలోకి చంద్రబాబు .. ఈనెల 19 నుంచి ప్రజాచైతన్య యాత్రటార్గెట్ జగన్ ..ప్రభుత్వ వైఫల్యాలపై రంగంలోకి చంద్రబాబు .. ఈనెల 19 నుంచి ప్రజాచైతన్య యాత్ర

19 నుంచి టీడీపీ ప్రజా చైతన్య యాత్ర

19 నుంచి టీడీపీ ప్రజా చైతన్య యాత్ర

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఉన్న పరిస్థితులను, ఏపీ వెనుకబడుతున్న తీరును ఆయన ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలని ప్రజా చైతన్య యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది . ఇక ఈ యాత్ర సుమారు 45 రోజుల పాటు ఇది కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తుంది.

 తొమ్మిది నెలల కాలంలో తొమ్మిది మోసాలు, భారాలు, రద్దులు .. ప్రచారం

తొమ్మిది నెలల కాలంలో తొమ్మిది మోసాలు, భారాలు, రద్దులు .. ప్రచారం

రేపు ప్రకాశం జిల్లాలో ప్రజాచైతన్య యాత్ర ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. తొమ్మిది నెలల జగన్ పరిపాలనలో తొమ్మిది మోసాలంటూ వినూత్నంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు తెలుగుదేశం పార్టీ సిద్ధం అవుతుంది . తొమ్మిది నెలల కాలంలో తొమ్మిది మోసాలు, ముఖ్యమైన వాటిని ప్రస్తావిస్తూ,తొమ్మిది రద్దులు అంటూ వైసీపీ పాలనలో ఇప్పటి వరకు రద్దు చేసిన కీలక అంశాలను చెప్తూ, తొమ్మిది భారాలు అంటూ ప్రజల మీద వేసిన తొమ్మిది భారాలను వివరిస్తూ టీడీపీ ప్రచారం చెయ్యనుంది .

 ప్రజా చైతన్య యాత్రకు టీడీపీ సన్నాహాలు

ప్రజా చైతన్య యాత్రకు టీడీపీ సన్నాహాలు

యాత్ర కోసం ఎజెండా సిద్దం చేసి రంగంలోకి దిగుతోంది తెలుగుదేశం పార్టీ.రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా ప్రారంభం కానున్న టీడీపీ ప్రజా చైతన్య యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ పోస్టర్, కరపత్రాలను విడుదల చేసింది . రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరగనున్న యాత్రల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ప్రజలను భాగస్వాములను చేయాలని టీడీపీ పిలుపునిచ్చింది .

Recommended Video

TDP MLC Buddha Venkanna Made Comments On CM Jagan | Oneindia Telugu
మార్టూరులో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించనున్న చంద్రబాబు

మార్టూరులో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించనున్న చంద్రబాబు

45 రోజుల పాటు కొనసాగనున్న ప్రజా చైతన్య యాత్రలను బుధవారం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించనున్నారు. మొత్తానికి జగన్ తొమ్మిది నెలల పాలనపై తొమ్మిది మోసాలు, భారాలు, రద్దులు అంటూ వైసీపీ పాలనను కళ్ళకు కట్టినట్టు చెప్పటానికి సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో స్థైర్యం నింపటం ,అలాగే జగన్ పాలన ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పటం కోసం రంగంలోకి దిగుతున్న టీడీపీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

English summary
Former CM Chandrababu opposing the anti-people regime of AP CM Jagan Mohan Reddy . Chandrababu is preparing to go public and aware them on YCP government failures . Party chief Chandrababu himself is in the fray. He is starting the praja chaitanya yathra from 19th onwards. he is starting the tour from prakasham district . the highlights in the tour is the 9 nine months regime of ycp government tdp will talk about the the nine Scams, burdens, cancellations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X