హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనతా కర్ఫ్యూ రిలీఫ్: మనవడు దేవాన్ష్‌తో ఆడుకుంటూ..పాఠాలు చెబుతూ: రిలాక్స్‌గా చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడి రాజకీయ వ్యూహాలు, శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతుంటాయని చెబుతుంటారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో చంద్రబాబు బుర్ర పాదరసంలా పనిచేస్తుంటుందనేది పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుంటారు. అధికార పార్టీని ఇరుకున పడేయడానికి, ఉచ్చులో బిగించడానికి అనుక్షణం సరికొత్తగా వ్యూహాలు పన్నుతూ, పావులను కదుపుతూ కనిపిస్తుంటారాయన.

చంద్రబాబు చాణక్యం ఏమిటో..

చంద్రబాబు చాణక్యం ఏమిటో..

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు ఆయనను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారనడంలో సందేహాలు అక్కర్లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి ఏనాడూ వెనుకాడరు. తాను ప్రతిపక్షంలో కూర్చున్నప్పటికీ.. 23 మంది శాసనసభ్యుల బలం మాత్రమే ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఏనాడూ తనను తాను బలహీనుడిగా భావించలేదు. అధికార పార్టీ వైపు ఏకపక్షంగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడంలో చంద్రబాబు తన చాణక్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

క్వైట్ అండ్ కామ్‌గా..

క్వైట్ అండ్ కామ్‌గా..

అలాంటి చంద్రబాబు క్వైట్ అండ్ కామ్‌గా ఉండటం ఎప్పుడైనా చూశారా? ప్రతిపక్ష నేతగా నిప్పులు కురిపించే ఆయన ప్రశాంతంగా, కుటుంబ సభ్యుల మధ్య గడుపుతూ, మనవడితో కాలక్షేపం చేయడం కాస్త అరుదైన దృశ్యంగానే చెప్పుకోవచ్చు. అలాంటి సన్నివేశం మరొకటి ఆదివారం చోటు చేసుకుంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు చంద్రబాబు.

జూబ్లీహిల్స్‌ ఇంట్లో స్వీయ గ‌‌ృహనిర్బంధం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో స్వీయ గృహనిర్బంధంలో గడిపారు. చంద్రబాబు ఒక్కరే కాదు.. ఆయన కుమారుడు, మాజీమంత్రి నారా లోకేష్, భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి.. ఇలా వారంతా స్వీయ గృహనిర్బంధంలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన మనవడు నారా దేవాన్ష్‌తో ఆడుకుంటూ సరదాగా గడిపారు. దేవాన్ష్‌కు పాఠాలు చెబుతూ కనిపించారు. ఇంగ్లీష్‌లో ఉన్న పాఠ్యపుస్తకాన్ని చదవి వినిపించి, దాని అర్థం ఏమిటో వివరించాలని దేవాన్ష్‌ను ప్రశ్నించడం ఆసక్తికరంగా కనిపించింది.

Recommended Video

AP Local Body Polls: No Elections In AP, Supreme court Supports Election Commission!
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో..

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో..

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్.. శనివారం ఉదయమే అమరావతిలోని ఉండవల్లి నివాసం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చారు. సాధారణంగా హెలికాప్టర్ లేదా ప్రత్యేక విమానంలో రాకపోకలు సాగించే ఆయన ఈ సారి రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. కరోనా వైరస్ వల్ల విమానాలు రద్దు కావడం, తాను వెళ్లడమంటూ జరిగితే విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటారని చంద్రబాబు భావించడం వల్లే కారులో హైదరాబాద్‌కు చేరారు.

English summary
Telugu Desam Party President and Former Chief Minister Chandrababu Naidu observing the Janta Curfew at his own residence at Jubilee Hills in Hyderabad. Chandrababu observing the Janata Curfew by reading out a book to his grand son Devaansh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X