• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రెండుసార్లు అవకాశం వచ్చినా..జగన్ ను ఏమీ చేయలేకపోయాం: క్యాడర్ పై చంద్రబాబు ఫైర్

|

నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎవరూ ఎందుకు నోరెత్తట్లేదు. ప్రభుత్వాన్ని విమర్శించడంలో మనం చాలా వెనుకబడ్డాం. ఇప్పటికే రెండుసార్లు అవకాశం వచ్చింది. ఏ ఒకరిద్దరో ప్రభుత్వంపై దాడి చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఉమ్మడిగా ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని వినిపించాలి. పరిస్థితి ఇట్లాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తప్పవు.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా స్థాయి నాయకులకు చేస్తోన్న హితబోధ ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంపై విమర్శలు దాడిని ముమ్మరం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ భవనంలో కార్యాలయాల గదులను కోల్పోయిన తెలుగుదేశం!

జిల్లా పర్యటన వల్ల..

జిల్లా పర్యటన వల్ల..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా నిర్వహిస్తోన్న జిల్లా పర్యటనలు, సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. తెలుగుదేశానికి కంచుకోటగా భావించే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నం జిల్లాతో ఆయన ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పార్టీ నాయకులను స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమాయాత్తం చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తరువాత టీడీపీ క్యాడర్ పూర్తిగా డీలా పడింది. వారిలో నూతనోత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.

 రెండుసార్లు అవకాశం వచ్చినా..

రెండుసార్లు అవకాశం వచ్చినా..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడానికి రెండుసార్లు అవకాశం వచ్చినా, దాన్ని ఉపయోగించుకోలేకపోయామని చంద్రబాబు పార్టీ క్యాడర్ కు హితబోధ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రశ్నాపత్రం లీక్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో విఫలం అయ్యామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రశ్నాపత్రాల లీక్ సమయంలో తనతో పాటు మరి కొందరు మాత్రమే ముఖ్యమంత్రిని విమర్శించామని, మిగిలిన వారు ఏం చేస్తున్నారని ఆయన వ్యక్తం చేశారని సమాచారం.

కార్నర్ చేయలేకపోతున్నాం..

కార్నర్ చేయలేకపోతున్నాం..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎంత మాత్రమూ ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున ఏ చిన్న పొరపాటు చోటు చేసుకున్నా, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్యాడర్ మీదే ఉందని ఆయన స్పష్టం చేశారు. గోదావరి నదిలో బోటు మునక సమయంలో నెల్లూరు జిల్లాకే చెందిన జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కార్నర్ చేయలేకపోయామని చంద్రబాబు పేర్కొన్నారట. జిల్లా స్థాయి నాయకులు తమ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రులు, మంత్రులను టార్గెట్ గా చేసుకుని గ్రామ స్థాయిలో విమర్శల తీవ్రతను పెంచాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

విమర్శల్లో ఘాటు తగ్గింది..

విమర్శల్లో ఘాటు తగ్గింది..

ప్రభుత్వంపై గానీ, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై గానీ పస లేని విమర్శలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విమర్శల్లో ఘాటు తగ్గకూడదని సూచించారని చెబుతున్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేయడంపై పార్టీ క్యాడర్ దృష్టి పెట్టాలని, జిల్లా స్థాయి నాయకులు తరచూ క్షేత్రస్థాయి నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని, వారికి దిశానిర్దేశం చేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. మున్ముందు ఇలాంటి పొరపాట్లు చేయకూడదని అన్నారు. ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశించి, పొరపాట్లను జనంలోకి తీసుకెళ్లగలిగితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన క్యాడర్ ను ఉత్తేజితులను చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party President and Former Chief Minister Chandrababu Naidu was given a rousing reception when he reached the city as part of his two-day tour to the district. The party leadership was surprised to find hundreds of party workers attending Naidu’s meeting at Anil Gardens. TDP lost all 10 assembly constituencies and the lone Lok Sabha constituency in Lok Sabha constituency in the district to YSRC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more