నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీతో టచ్‌లో మాజీమంత్రి నారాయణ?: దర్యాప్తు ఎఫెక్ట్? నెల్లూరు సిటీ సీటుకు టీడీపీ కొత్త ఇన్‌ఛార్జి

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నారాయణ కూడా వలస బాట పట్టారా? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూపులు సారించారా? హఠాత్తుగా ఆయనను నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించడానికి కారణం అదేనా? ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోన్న ప్రశ్నలు ఇవి. మాజీ మంత్రి నారాయణ వైసీపీకి చెందిన కొందరు పెద్ద తలకాయలతో టచ్‌లో ఉన్నారనేది హాట్ టాపిక్‌గా మారింది.

చంద్రబాబు కోసం ఢిల్లీ బాబాయిలు.. అరెస్టులపై మంత్రి నాని.. శిక్షకు సిద్ధమన్న వేమూరి..చంద్రబాబు కోసం ఢిల్లీ బాబాయిలు.. అరెస్టులపై మంత్రి నాని.. శిక్షకు సిద్ధమన్న వేమూరి..

 కోటంరెడ్డి బాధ్యతలు అప్పగించడం వెనుక..

కోటంరెడ్డి బాధ్యతలు అప్పగించడం వెనుక..

గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల తరువాత నారాయణ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. నిజానికి- ఆయన 20 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పని చేసినప్పటికీ.. ఏనాడూ తెరముందుకు వచ్చి రాజకీయాలు చేయలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పేరు పెద్దగా చర్చల్లోకి రాలేదు. అలాంటిది- చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అనూహ్యంగా మంత్రివర్గం చోటు దక్కించుకోగలిగారు. అత్యంత కీలకమైన మున్సిపల్ మంత్రిత్వ శాఖ పగ్గాలను అందుకున్నారు.

సీఆర్‌డీఏ భూముల సేకరణ ఆయన సారథ్యంలోనే

సీఆర్‌డీఏ భూముల సేకరణ ఆయన సారథ్యంలోనే

రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌డీఏ) ఏర్పాటు సహా రాజధాని అమరావతి ప్రాంత భూముల సమీకరణలో నారాయణ కీలకంగా వ్యవహరించారు. భూముల సమీకరణకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలన్నీ నారాయణ సారథ్యంలోనే కొనసాగాయి. రాజధానికి సంబంధించిన ఒకట్రెండు కమిటీల్లో నారాయణ సభ్యుడు కూడా. రాజకీయాలకు దూరంగా ఉంటోన్న వ్యక్తికి చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకుని, కీలక బాధ్యతలను అప్పగించడం అప్పట్లో సంచలనం రేపింది.

దర్యాప్తు ఎఫెక్ట్..

దర్యాప్తు ఎఫెక్ట్..

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న రాజధాని అవినీతి కార్యకలాపాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా ఓ దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ విషయంలో సిట్.. ఇప్పటికే ఓ అధికారిణిని అరెస్టు చేసింది. దర్యాప్తు మరింత తీవ్రమౌతోంది. రేపో, మాపో రాజధాని అమరావతి అవినీతిపై సీబీఐ విచారణకూ ఆదేశించడానికి అవకాశం లేకపోలేదనే అంటున్నారు.

వైసీసీ వైపు చూపులు అందుకేనా?

వైసీసీ వైపు చూపులు అందుకేనా?

రాజధాని అమరావతిని అడ్డుగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ అక్రమాలన్నింటినీ తవ్వి తీయడానికి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో మాజీమంత్రి నారాయణ వైసీపీ వైపు చూపులు సారించడానికి అదే ప్రధాన కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. అందుకే- వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారనీ అంటున్నారు.

Recommended Video

Telugu Teacher Lost His Job, Selling Bananas In Nellore
కోటంరెడ్డికి బాధ్యతలు..

కోటంరెడ్డికి బాధ్యతలు..

కారణాలు ఏమైనప్పటికీ.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పించడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నారాయణ స్థానంలో పార్టీ సీనియర్ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని నియమించడం వెనుక చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరించారని టీడీపీ నాయకులే స్పష్టం చేస్తున్నారు. నారాయణ పార్టీలో కొనసాగుతారనే అనుమానాలు తలెత్తడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

English summary
Telugu Desam Party President Chandrababu Naidu have removed Ex minister Narayana as Nellore City assembly constituency incharge. He appoints Kotamreddy Srinivasula Reddy as Nellore City Incharge
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X