వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాను ఎక్కడా.. బాస్టర్డ్ అనలేదు... జగన్‌కు ఒళ్లంతా కొవ్వు.... చంద్రబాబునాయుడు

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీలో ఘర్షణలో తాను అనని మాటలను అన్నానని చెప్పి.. ఏకగ్రీవ తీర్మాణం చేసి... స్పీకర్‌కు ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఫైర్ అయ్యారు... ప్రతిపక్షానికి ఉండే హక్కులను ప్రభుత్వం హరించివేస్తుందని ఆయన విమర్శించారు. మరోవైపు సీఎం జగన్‌ను తనను టార్గెట్ చేస్తూ...ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉన్మాది అనే మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అందుకోసం సస్పెండ్ చేస్తే..తాను సిద్దంగా ఉన్నానని అన్నారు... ఈ నేపథ్యంలోనే తనకు అడ్డంకులు సృష్టించి, వేధింపులకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

 తాను బాస్టర్డ్ అనలేదు...

తాను బాస్టర్డ్ అనలేదు...

అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం సభ్యులు తనను టార్గెట్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనపై ఆయన ప్రెస్‌మీట్ ద్వార ఖండించారు. ఈ నేపథ్యంలోనే తాను అధికారులను బాస్టర్డ్ అన్నట్టు... అనని మాటాలను అసెంబ్లీలో ప్రస్తావించారని చెప్పారు. దాన్ని స్వయంగా సీఎం ప్రస్తావించి... ఇతర సభ్యుల చేత చెప్పించారని అన్నారు. ఈ సంధర్బంగా తాను అన్న మాటలకు సంబంధించిన వీడియోను సైతం ప్రదర్శించారు. ప్రభుత్వం చూపించిన వీడీయోలో ఎక్కడైనా...తాను బాస్టర్డ్ అన్నట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు.

జగన్ ముమ్మాటికి ఉన్మాదే....

జగన్ ముమ్మాటికి ఉన్మాదే....


ఇక అసెంబ్లీలో తాను సీఎంను ఉన్మాది అన్నందుకు సస్పెండ్ చేయాలని భావిస్తే...చేయండని...ఉన్మాది అనడం తప్పు కాదని, ఇది చట్టవ్యతిరేకపదం కాదని అన్నారు. ఇప్పుడు కూడ సీఎం జగన్‌ను అన్న మాటలపై తాను నిలబడతానని అన్నారు. అయితే...కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అనవసరమైన అరోపణలు చేయడం కరెక్టు కాదని అన్నారు. ఇక ఈ సంఘటనపై స్పీకర్ వ్యవహరించిన తీరుపైనా ఆయన ఫైర్ అయ్యారు. సభలో ఇదంతా జరుగుతుంటే స్పీకర్ ఆనందిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి అనుభవం లేక పోవడంతో పాటు పొగరు ఉందని, కాని అనుభవం ఉన్న స్పీకర్ చేస్తున్న విధానం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జరిగిన సంఘటనపై ఇద్దరిని కూర్చోబెట్టి చర్చించాల్సిన స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

గతంలో కేసులు పెట్టిన అధికారులపై కక్షసాధింపు

గతంలో కేసులు పెట్టిన అధికారులపై కక్షసాధింపు

కాగా జగన్‌పై అదాయ పన్నుల కేసులను పెట్టిన అదాయపు పన్నుశాఖ అధికారులను కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటేషన్ లో క్రిష్ణ కిషోర్‌ను సస్పెండ్ చేశారని అన్నారు. ఇక తనతోపాటు నేరారోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ముఖ్యమైన పోస్టులు ఇచ్చి... ఆయన కేసుకు సంబంధించి సాక్ష్యాలు తారుమారు చేయడం లాంటీవి చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలనే తాము సభలో ప్రస్తావిస్తామనే... సభను తప్పుదోవ పట్టించేందుకు అనని మాటలను అన్నట్టు ప్రచారం చేశారని అన్నారు.

 స్పీకర్‌కు ప్రివిలేజ్‌మోషన్ నోటీసు

స్పీకర్‌కు ప్రివిలేజ్‌మోషన్ నోటీసు


అసెంబ్లీ బయట ధర్నా చేసి, లోపలికి వస్తామని ప్రయత్నం చేస్తే... దాన్ని అడ్డుకున్నారని చంద్రబాబు అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేశారని ఇందుకోసమే స్పీకర్‌కు ప్రివిలేజ్‌మోషన్ నోటీసు ఇచ్చినట్టు చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి తప్పుడు సమాచారం ఇచ్చి అనని మాటలు అన్నట్టు ముఖ్యమంత్రి చెప్పారని.. ఇందుకోసం సీఎం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అందుకే ప్రవిలేజ్ మోషన్ ఇచ్చినట్టు ఆయన వివరించారు.

English summary
AP TDP PRESIDENT CHANDRABABU NAIDU FIRES ON YCP GOVERNMENT, AND HE ALLEGED THAT GOVT TARGET HIM IN THE ASSEMBLY
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X