• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ డీజీపీ ఆఫీస్ వద్ద టీడీపీ ఆందోళనతో టెన్షన్ ; స్టేట్ స్పాన్సార్డ్ అటాక్ .. పోలీసులపై ఆగ్రహం

|

చంద్రబాబు ఇంటిని వైసీపీ నాయకులు ముట్టడించటంతో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు అడ్డుకోలేదని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. బాబు నివాసం పై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ డీజీపీ కార్యాలయంలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు.

డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
తెలుగుదేశం పార్టీ నేతల ఆందోళనల మధ్య పోలీసులు డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వచ్చిన టీడీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టిడిపి నేతలు ధ్వజమెత్తారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి గౌరవంగా డీజీపీ కార్యాలయంలో కి ఆహ్వానించే పోలీసులు టిడిపి ఎమ్మెల్యేలను రోడ్లపైనే అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేకు ఇచ్చిన గౌరవం తమకు ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.

TDP protest at AP DGP office ; TDP Anger at police over chandrababu house attack

జోగి రమేష్ 24 గంటల ముందే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం అని వెల్లడి .. పోలీసులేం చేశారు
భారీగా మోహరించిన పోలీసులు టిడిపి నేతలను అడ్డుకోవడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేస్తామని 24 గంటల ముందు ట్విట్టర్ లో, వాట్సాప్ లో ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రకటించి కర్రలు, రాళ్లతో దాడి చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. రమేష్ పై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని టిడిపి నేతలు పోలీసులను ప్రశ్నించారు.

సోషల్ మీడియాలోనూ టీడీపీ ధ్వజం .. స్టేట్ స్పాన్సార్డ్ ఎటాక్, పోలీసుల వైఫల్యం
ఇక సోషల్ మీడియా వేదికగానూ జగన్ గూండారాజ్ అంటూ పోస్ట్ పెట్టిన టిడిపి ఇది స్టేట్ స్పాన్సార్డ్ ఎటాక్ అంటూ ధ్వజమెత్తింది. కర్రలు, రాడ్లు, రాళ్లతో 20 వాహనాల్లో వంద మందికి పైగా చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు తెలుగు తమ్ముళ్లు. ఈ రోజు చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి పోలీసుల వైఫల్యం వల్లే అంటూ టిడిపి నేతలు ఆరోపించారు. జోగి రమేష్ ని ముద్దాయి అని చెప్పగానే.... జోగి రమేష్ ముద్దాయి అని ఎలా అంటారు అంటూ కోపంతో పోలీస్ అధికారి ఊగిపోయారని పోలీసులతో వాగ్వాదానికి సంబంధించిన ఒక వీడియోను టిడిపి నేతలు పోస్ట్ చేశారు. వైసీపీ కార్యకర్తల దాడిలో టీడీపీ కార్యకర్తలకు తలలు పగిలాయని, ఓ కార్యకర్త కాలు విరిగింది అని అయినప్పటికీ పోలీసులు దీనిపై పట్టించుకోకపోవడం దారుణమని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబుకే రక్షణ లేకుంటే రాష్ట్రంలో శాతి భద్రతల పరిస్థితి ఏంటి ? అయ్యన్న ప్రశ్న
ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబుకే రక్షణ కరువైందని టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే జోగి రమేష్ 24 గంటల ముందే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని బహిరంగంగా చెప్పిన చంద్రబాబు ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడం పోలీసుల తీరుకు నిదర్శనమని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను అడుగడుగునా నిలువరించే పోలీసులు చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించినా ఎందుకు స్పందించలేదో చెప్పాలని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి రక్షణ కరువైంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

English summary
TDP MLAs and former MLAs protested at the AP DGP's office against the attitude of the police. An attempt was made to lodge a complaint with the DGP at the DGP's office, strongly condemning the attack on Babu's residence. An altercation ensued between the TDP leaders and the police as they resisted. TDP leaders questioned the police for saying that Jogi Ramesh had declared a siege on Chandrababu's house yesterday but the police could not prevent it and what action had been taken against Jogi Ramesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X