వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీలో ఇంకా ఆ ఇద్ద‌రి నిర్ణ‌యాలేనా..!! మ‌రి.. చంద్ర‌బాబు పరిస్థితి ఏంటీ..? రాజ్యసభ సాక్షిగా...

|
Google Oneindia TeluguNews

టీడీపీలో నిర్ణ‌యాలు ఇప్పుడు అధినేత చంద్ర‌బాబు తీసుకోవ‌టం లేదా. టీడీపీని వీడి బీజేపీలో చేరిన ఆ ఇద్ద‌రు ఎంపీ లు చెప్పిందే డీడీపీలో జ‌రుగుతోందా. చంద్ర‌బాబు ఎందుకింత మౌనంగా ఉన్నారు. ఆయ‌న ఆమోదంతోనే ఇదంతా న‌డుస్తోందా. ముందుగా బీజేపీకి ద‌గ్గ‌ర అయితే చాలు అనుకుంటున్నారా. ఇప్పుడు ఇదే చ‌ర్చ‌..ఇవే ప్ర‌శ్న‌లు టీడీపీ లో క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. టీడీపీని వీడి బీజేపీలో చేరిన న‌లుగురు ఎంపీల్లో ఆ ఇద్ద‌రు ఇప్పుడు పూర్తిగా టీడీపీ ఎంపీల ను బీజేపీ కోసం ఏర‌కంగా వినియోగించుకోవాలో..ఆ ర‌కంగా ఉప‌యోగించుకుంటున్నారు. అయితే, ఇదంతా ప‌క్కా ప్ర‌ణాళికా బ‌ద్దంగానే జ‌రుగుతోంద‌నే ప్ర‌చార‌మూ మొద‌లైంది.

కేంద్ర అభ్యంతాల‌పై నేరుగా ప్ర‌ధానితోనే: ఆగ‌స్టు 6న ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌: వెంక‌య్య నాయుడుతోనూ..!కేంద్ర అభ్యంతాల‌పై నేరుగా ప్ర‌ధానితోనే: ఆగ‌స్టు 6న ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌: వెంక‌య్య నాయుడుతోనూ..!

Recommended Video

సీఎంకు అభినందనలు తెలుపుతున్న బడుగు బలహీన వర్గాలు
ఆ ఇద్ద‌రూ కోరుకున్న విధంగా..

ఆ ఇద్ద‌రూ కోరుకున్న విధంగా..

బీజేపీ మీద‌..ముఖ్యంగా ప్ర‌ధాని మోదీ మీద ఆకాశ‌మే హ‌ద్దుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు చేసారు. మోదీ ఇక ప్ర‌ధాని అయ్యేది లేద‌ని తేల్చారు. ఎన్నిక‌ల్లో అంచ‌నాలు తారు మార‌య్యాయి. అంతే..చంద్ర‌బాబు ఊహించ‌ని దెబ్బ‌కు షాక్ అయ్యారు. ఇక‌..ఆయ‌న గ‌తంలో విదేశాల‌కు వెళ్ల‌గానే పార్టీకి చెందిన న‌లుగురు రాజ్యస‌భ స‌భ్యులు పార్టీ రాజ్య‌స‌భ పార్ల‌మెంట‌రీ పార్టీని ఏకంగా బీజేపీలో విలీనం చేసారు. చంద్ర‌బాబు కోటరీలో కీల‌క వ్య‌క్తులుగా గుర్తింపు ఉన్న సుజ‌నా చౌద‌రి..సీఎం ర‌మేష్ సైతం బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. అయితే భ‌విష్య‌త్ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబు స‌మ్మ‌తితోనే వారు బీజేపీలో చేరార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక‌, ఈ మ‌ధ్య కాలంలో రాజ్య‌స‌భ‌లో వారు ఇద్ద‌రూ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఒక ర‌కంగా బీజేపీ ఎంపీల కంటే వీరిద్ద‌రే ఎక్కువ‌గా బీజేపీ గురించి ఆలోచ‌న చేస్తు న్నారు. గ‌త వారం ఆర్టీఐ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు.. తాజాగా త‌లాక్ బిల్లు స‌మ‌యంలో టీడీపీ ఎంపీల తీరు..వారిని న‌డిపించి న ఆ ఇద్ద‌రి తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

చంద్ర‌బాబు ప్రేక్ష‌క పాత్ర‌కే...అంతా తెలిసేనా

చంద్ర‌బాబు ప్రేక్ష‌క పాత్ర‌కే...అంతా తెలిసేనా

ఆ న‌లుగురు బీజేపీలో చేరిన స‌మ‌యంలో నామ మాత్రంగా స్పందించిన చంద్ర‌బాబు..టీడీపీ నేత‌లు ఆ త‌రువాత ఎక్క‌డా వీరి గురించి వ్య‌తిరేకంగా మాట్లాడ‌లేదు. ఇక‌..న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు టీడీపీ నుండి బీజేపీలోకి ఫిరాయిం చినా..మిగిలిన ఇద్ద‌రు మాత్రం టీడీపీలోనే ఉన్నారు. అయితే, ఆర్టీఐ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు స‌మ‌యంలో తొలుత టీడీపీ స‌భ్యుడు స‌భ‌లో వ్య‌తిరేకించినా..త‌రువాత మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. స‌భ‌లో లోని స‌భ్యురాలు సీతామ‌హాల‌క్ష్మిని ప్ర‌త్యేక విమానంలో పిలిపించి బీజేపీ నిర్ణ‌యానికి అనుకూలంగా ఓటు వేయించారని స‌మాచారం. ఇక‌..త‌లాక్ బిల్లు విష‌యం లో స‌భ‌లో టీడీపీ స‌భ్యుడు ఒక‌రు వ్య‌తిరేకించినా..ఇద్ద‌రు స‌భ్యులు వాకౌట్ చేసారు. ప‌రోక్షంగా బీజేపీకి స‌హ‌క‌రించారు. మొత్తంగా టీడీపీ స‌భ్యులు సీఎం ర‌మేష్ సూచ‌న‌ల మేర‌కు న‌డుచుకుంటున్నార‌నే చ‌ర్చ టీడీపీలో జ‌రుగుతోంది. ఇది బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకే అన్నీ తెలిసి పార్టీ అధినేత చంద్ర‌బాబు మౌనంగా ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

బీజేపీతో దోస్తీ కోసం ప్ర‌య‌త్నాలా..

బీజేపీతో దోస్తీ కోసం ప్ర‌య‌త్నాలా..

ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోయిన తాము ఏపీలో ..తిరిగి కేంద్రంలో బ‌లం పెంచుకోవాలంటే పాత మిత్రుల‌తో క‌లిసి ఉండ‌ట‌మే మంచిద‌నే అభిప్రాయం టీడీపీలో వ్య‌క్తం అవుతోంది. టీడీపీ నుండి పెద్ద ఎత్తున వ‌ల‌స‌ల‌ను బీజేపీ ప్రోత్స‌హిస్తున్న ఈ స‌మ‌యంలో బీజేపీతో స‌ఖ్య‌త‌గా ఉంటే వ‌ల‌స‌లు ఆగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏపీలో జ‌గ‌న్‌ను ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎదుర్కోవాలంటే బీజేపీతో స‌ఖ్య‌త‌గా ఉంటేనే మంచిద‌ని పార్టీలో చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో పార్టీ వీడిన వారు చెప్పిన విధంగా మిగిలిన వారు న‌డుచుకోవ‌టం పైన మాత్రం పార్టీలో భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీని ద్వారా టీడీపీలో వ‌ల‌స‌లు ఆగుతాయా లేక‌..బీజేపీ మైత్రి అధికారికంగా ఉంటుందా అనే చ‌ర్చ పార్టీలోకి కింద స్థాయి కేడ‌ర్‌లో మాత్రం బ‌లంగా సాగుతోంది.

English summary
TDP Rajyasabha MP's following directions of CM Ramesh and Sujana Chowdary who recently joined in BJP. Now this issue created hot discussion in TDP cadre
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X