వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడే ఓట్లు అడుగుతా: జగన్ పెద్ద హామీ, అళ్లగడ్డలో అలా ముగిసింది, పావురాన్ని గిఫ్ట్‌గా ఇస్తే

అమలు చేయలేని కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్‌ అధికారంలోకి రావడం కల్ల అని మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదివారం అన్నారు. ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: అమలు చేయలేని కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్‌ అధికారంలోకి రావడం కల్ల అని మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదివారం అన్నారు. ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.

Recommended Video

YS Jagan public meeting in Allagadda ఆళ్లగడ్డలొ జగన్‌కు ఊహించని మద్దతు

చంద్రబాబును చూసి ఆశ్చర్యపోయా, అడిగితే సరేనని చెప్పా: బిల్ గేట్స్ ప్రశంసలుచంద్రబాబును చూసి ఆశ్చర్యపోయా, అడిగితే సరేనని చెప్పా: బిల్ గేట్స్ ప్రశంసలు

గుంటూరు పట్టణంలో అన్నసంజీవిని జనరిక్‌ మందుల షాపును పత్తిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జగన్‌ వాగ్ధానాలన్నీ నీటి మీద రాతలే అన్నారు. వచ్చే ఎన్నికల్లోగా ఏదొక విధంగా కేసుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతోనే పాదయాత్ర చేపట్టారన్నారు.

 16 నెలలు జైల్లో గడిపి వచ్చాడు

16 నెలలు జైల్లో గడిపి వచ్చాడు

పదహారు నెలలు జైల్లో గడిపి, పన్నెండు కేసులలో ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్‌ పాదయాత్రను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పత్తిపాటి చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుందని చెప్పారు.

నా వంతు ప్రయత్నం చేస్తా

నా వంతు ప్రయత్నం చేస్తా

మరోవైపు, జగన్ పాదయాత్ర ఆదివారం పన్నెండో రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీచర్లు, 108, 104 ఉద్యోగులు ఆయనను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. తమ సమస్య పరిష్కారానికి సహకారం అందించాలని కోరారు. తన వంతు ప్రయత్నం చేస్తానని జగన్ చెప్పారు.

 రాష్ట్రానికి మంచి రోజులు

రాష్ట్రానికి మంచి రోజులు

శనివారం జగన్ పాదయాత్ర ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దోర్నిపాడు నుంచి బనగానపల్లె నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి త్వరలో మంచిరోజులు రానున్నాయన్నారు.

 మద్యాన్ని నిషేధిస్తానని జగన్ హామీ

మద్యాన్ని నిషేధిస్తానని జగన్ హామీ

ప్రజాసమస్యలను స్వయంగా తెలుసుకోవాలనే పాదయాత్ర చేపట్టినట్లు జగన్ తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. రుణాల మొత్తాన్ని నేరుగా నాలుగు దఫాలుగా చేతికి అందిస్తామన్నారు. 2024 ఎన్నికల నాటికి మద్యాన్ని పూర్తిగా నిర్మూలించిన తర్వాతే ఓట్ల కోసం ప్రజల ముందుకు వెళ్తానని జగన్ పెద్ద హామీ ఇచ్చారు.

 జగన్‌కు అభిమాని పావురాన్ని ఇస్తే

జగన్‌కు అభిమాని పావురాన్ని ఇస్తే

జగన్‌కు శనివారం ఓ అభిమాని పావురాన్ని కానుకగా ఇచ్చారు. దానిని ఆయన గాలిలోకి విడిచిపెట్టారు. శనివారం ఉదయం 8.30 ప్రారంభమైన పాదయాత్ర ఒక కిలోమీటరు దూరం సాగేందుకు గంటన్నర సమయం తీసుకొంది. మొత్తంమీద ఆళ్లగడ్డలో ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా పాదయాత్ర ముగిసింది.

English summary
The Praja Sankalpa Yatra of YSR Congress Party president YS Jagan Mohan Reddy entered the 12th day on Sunday. It passed through the Banaganapalle Assembly constituencies in the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X