వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ వ్యాఖ్యలతో టీడీపీ అప్రమత్తం: అతిపెద్ద కుంట్రంటూ నేతలకు జాగ్రత్తలు, అందుకేనా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ కళ్యాణ్ ట్వీట్ తో మారిన రాజకీయం

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లపై తీవ్రస్థాయిలో మండిపడిన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం స్పందించింది. పవన్ ట్వీట్ వ్యాఖ్యలపై పార్టీ నేతలెవరూ స్పందించవద్దని ఆదేశించింది.

నాపై బాబు, లోకేష్‌ల రూ.10కోట్ల కుట్ర, చనిపోవడమే మంచిది: పవన్ సంచలనం, మీడియాపైనా.. నాపై బాబు, లోకేష్‌ల రూ.10కోట్ల కుట్ర, చనిపోవడమే మంచిది: పవన్ సంచలనం, మీడియాపైనా..

అతిపెద్ద కుట్ర

అతిపెద్ద కుట్ర

పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తే చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష పక్క దారిపడుతుందని టీడీపీ అధిష్టానం అభిప్రాయపడింది. శ్రీరెడ్డి ఎపిసోడ్‌ను రాజకీయాలకు ఆపాదించడంలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర ఉందని పేర్కొంది.

ప్రాధాన్యత తగ్గుతుందనే..

ప్రాధాన్యత తగ్గుతుందనే..

చంద్రబాబు దీక్షా సమయంలో ఈ తరహా రాజకీయాలకు తెరలేపడం కుట్రలో భాగమేనని టీడీపీ అధిష్టానం అభిప్రాయపడింది. ఒక వేళ టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేస్తూ రంగంలోకి దిగితే చంద్రబాబు చేపట్టిన దీక్షకు తగిన ప్రాధాన్యత లభించకపోవచ్చనే టీడీపీ అధిష్టానం ఈ మేరకు అప్రమత్తంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

పవన్ తీవ్ర వ్యాఖ్యలు

పవన్ తీవ్ర వ్యాఖ్యలు

కాగా, పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ తోపాటు ఇతర కొన్ని మీడియా సంస్థలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. రూ.10కోట్లతో చంద్రబాబు, లోకేష్, కొన్ని మీడియా ఛానళ్లు తనపై కుట్ర చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సెక్రటేరియట్ వేదికగానే ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. ఇంత నీచానికి దిగజారుతారా? అంటూ మీడియా సంస్థలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకరోజు బాబు దీక్ష

ఒకరోజు బాబు దీక్ష

కాగా, చంద్రబాబు నాయుడు ఏపీ పట్ల కేంద్రం తీరుకు నిరసనగా శుక్రవారం ఉదయం 7గంటలకు ధర్మపోరాటం పేరుతో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. రాత్రి 7గంటల వరకు చంద్రబాబు దీక్ష కొనసాగుతోంది.

English summary
TDP responded on Janasena president Pawan Kalyan tweet comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X