వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ వ్యర్థ ప్రసంగాలేంటి, సీఎంకు ఇన్నేళ్లు పట్టిందా: గల్లా ప్రసంగంపై పవన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

గల్లా జయదేవ్ ప్రసంగం పై పవన్ కళ్యాణ్ ట్వీట్లు

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెదవి విరిచారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానం సందర్భంగా గల్లా దాదాపు గంట పాటు కేంద్రం ఇచ్చిన విభజన హామీలపై మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మోడీపై గల్లా తీవ్రవ్యాఖ్య, నిర్మల ఆగ్రహం: కాంగ్రెస్‌తో కలిసి.. దులిపేసిన ఎంపీమోడీపై గల్లా తీవ్రవ్యాఖ్య, నిర్మల ఆగ్రహం: కాంగ్రెస్‌తో కలిసి.. దులిపేసిన ఎంపీ

తాజాగా, జనసేన అధినేత పవన్ స్పందించారు. లోకసభలో టీడీపీ వాదన చాలా బలహీనంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు పవన్ వరుస ట్వీట్లు చేశారు.

TDP’s argument is very weak and feeble in parliament session today: Pawan Kalyan

సభలో టీడీపీ వాదన చాలా బలహీనంగా ఉందని, ప్యాకేజీకి అంగీకరించడానికి గల కారణాలు చెప్పలేదన్నారు.

'వ్యక్తిగత లాభాల కోసం స్పెషల్ క్యాటగిరి స్టేటస్‌కు మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్ధమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి? దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకి కేంద్రం వంచన తెలియటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా?' అని మరో ట్వీట్లో పేర్కొన్నారు.

ఏపీ ప్రజలు టీడీపీ నాయకులకు ఎలా కనిపిస్తున్నారని మరో ట్వీట్ పెట్టారు. వ్యక్తిగత లాభాల కోసం టీడీపీ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిందని, టీడీపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అవిశ్వాసం ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందాల్సిన టీడీపీ దానిని దారుణంగా మిస్ చేసుకుందని విమర్శలు గుప్పించారు.

English summary
TDP’s argument is very weak & feeble in parliament session today.I feel they lacked the necessary moral fibre to take SCS demand forward as they had opposed, weakened & diluted the SCS ‘cause of their special package acceptance earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X