వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతిపై కుట్రలో కేంద్రం హస్తం: పవన్ వ్యాఖ్యలపై టిడిపి అనుమానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు కుట్ర చేస్తున్నాయని మంత్రి పత్తిపాటి పుల్లారావు సోమవారం ఆరోపించారు. ఇప్పటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేసులతో రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుందని మండిపడ్డారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతోనే ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో రైతులు వేల ఎకరాలు రాజధానికోసం ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అవి ఫలించవన్నారు.

చంద్రబాబునే అంటారా, ఎక్కడో చెప్పు: పవన్‌ను ఏకేసిన శివాజీ, సీఎంకు కేవీపీ లేఖచంద్రబాబునే అంటారా, ఎక్కడో చెప్పు: పవన్‌ను ఏకేసిన శివాజీ, సీఎంకు కేవీపీ లేఖ

కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని అనుమానం

కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని అనుమానం

రాజధానిని అడ్డుకునేందుకు పవన్, జగన్ వంటి వారు ప్రయత్నిస్తే రైతులు తిరగబడతారని పత్తిపాటి హెచ్చరించారు. అసైన్డ్ భూములకు కూడా ప్రభుత్వం సమీకరణ ద్వారా స్థలాన్ని ఇచ్చిందని, అమరావతిలో రాజధాని రావడం వల్ల భూముల రేటు బాగా పెరిగిందన్నారు. రాజధానిని అడ్డుకుంటామంటే రైతులే నష్టపోతారన్నారు. అమరావతిపై పవన్ వ్యాఖ్యలు, రాజధాని పర్యటనల వెనుక కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

కొన్ని వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు

కొన్ని వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ కొన్ని వర్గాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారని మత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కాపు రిజర్వేషన్లపై ఓసారి కావాలని, ఇప్పుడు కుదరదని జగన్ మాట మారుస్తున్నారన్నారు.

జగన్ ఇప్పుడు చేతులెత్తేశారు

జగన్ ఇప్పుడు చేతులెత్తేశారు


జగన్ చాలా అసహనంతో మాట్లాడుతున్నారని మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లు, పవన్ కళ్యాణ్‌పై ప్రతిపక్ష నేత మాట్లాడిన తీరు సరిగా లేదన్నారు. కాపు రిజర్వేషన్లకు మద్దతిస్తున్నామని అసెంబ్లీలో చెప్పిన జగన్ ఇప్పుడు తమ వల్ల కాదంటూ ఇప్పుడు చేతులెత్తేశారన్నారు.

కేంద్రంపై పోరాడాలి

కేంద్రంపై పోరాడాలి

జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని సోమిరెడ్డి సవాల్ విసిరారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర బంద్‌లు చేపట్టడం కూడా సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఇలా బంద్‌లు నిర్వహిస్తే ప్రజలు ఇబ్బందికి గురవుతారన్నారు.

English summary
Andhra Pradesh Minister Prattipati Pulla Rao on Monday said that he is suspecting BJP behind Pawan Kalyan and YS Jagan capital conspiracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X