వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా అరెస్ట్ .. పోలీసుల దౌర్జన్యం అంటూ టీడీపీ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులు 23 వ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రైతుల పోరాటానికి మద్దతు తెలపటానికి వెళ్లాలని ప్రయత్నించిన టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు, బస్సు యాత్రలను, పాదయాత్రలను అడ్డుకుంటూ అరెస్ట్ ల పర్వాలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి ఆలపాటి రాజా పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

మాజీ మంత్రి ఆలపాటి రాజా పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

రాజధాని ఆందోళనల నేపధ్యంలో రాజధాని అమరావతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజాగా మాజీ మంత్రి ఆలపాటి రాజా పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ఆయనపై పోలీసులు దౌర్జన్యం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు . రాజధానికి మద్దతుగా తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌‌, రైతులతో కలిసి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు పక్కన కాలవలోకి రాజాని నెట్టేయడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని టీడీపీ నేతలు అంటున్నారు .

టీడీపీ నేతల గృహ నిర్బంధంపై చంద్రబాబు ఫైర్ .. పోలీసులు తీరుపై టీడీపీ నేతల ఆగ్రహంటీడీపీ నేతల గృహ నిర్బంధంపై చంద్రబాబు ఫైర్ .. పోలీసులు తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం

రాజా పాదయాత్ర ..అర్ధరాత్రి నుంచే హౌస్ అరెస్ట్ లు.. ఆలపాటి రాజా అరెస్ట్

రాజా పాదయాత్ర ..అర్ధరాత్రి నుంచే హౌస్ అరెస్ట్ లు.. ఆలపాటి రాజా అరెస్ట్

పోలీసుల తీరు పట్ల కార్యకర్తలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలపాటి రాజా పాదయాత్ర నేపథ్యంలో పలువురు ముఖ్య నేతలను అర్ధరాత్రి నుంచే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
పాదయాత్రగా అమరావతికి బయలుదేరిన ఆలపాటి రాజా నందివెలుగు సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేత ఆలపాటి రాజా అరెస్ట్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.

అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరన్న టీడీపీ

అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరన్న టీడీపీ

మరోవైపు ఆలపాటి పాదయాత్ర నేపథ్యంలో పలువురు టీడీపీ ముఖ్య నేతలను నిర్బంధించారని ,అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరని టీడీపీ నేతలు చెప్తున్నారు. రాజధాని అమరావతిని తరలించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అమరావతి రైతుల ఆవేదన ప్రభుత్వానికి పట్టటం లేదని అంటున్నారు.

వైసీపీవి అప్రజాస్వామిక విధానాలు

వైసీపీవి అప్రజాస్వామిక విధానాలు


టీడీపీ నేతల అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లను తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు.రాజధాని కోసం వేలాది కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా, మహిళలు పోరాటం చేస్తున్నా పట్టింపు లేనట్టు ప్రభుత్వం ప్రవర్తించటం దారుణం అన్నారు. రాజధాని పోరాటానికి మద్దతు చెప్పేందుకు వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని , అన్యాయమని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

English summary
Several prominent leaders have been arrested by the police since midnight in the wake of the recent Raja march towards amaravati .The march of the Raja who was on his way to Amaravati by walk were blocked by the police later arrested and taken him to the police station. tension during the Raja's arrest. Fierce fighting between the farmers and the police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X