వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టినరోజు నాడే..అయ్యన్నకు షాక్: టీడీపీకి సోదరుడు రాజీనామా: పోలీసులపై సంచలన వ్యాఖ్యలు..!!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి..టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయన్న పాత్రుడుకు జన్మదినం రోజే ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడు టీడీపీకి తన మద్దతు దారులతో కలిసి టీడీపీకి రాజీనామా చేసారు. సోదరుడు అయ్యన్నతో ఉన్న విబేధాల కారణంగానే ఆయన టీడీపీ వీడినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో నర్సీపట్నంలో మాజీ మంత్రి లోకేశ్ తో కలిసి అయ్యన్న ర్యాలీ నిర్వహణకు సిద్దం కాగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో అయ్యన్న తాము మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని..పోలీసులు మళ్లీ మా దగ్గరే పని చేయాలంటూ హెచ్చరించారు. అయ్యన్న సహనం కోల్పోయి చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు చర్చ మొదలైంది.

జగన్ హయాంలో తొలి సీబీఐ విచారణ : నవయుగ నుండి అడ్వాన్స్ రికవరీజగన్ హయాంలో తొలి సీబీఐ విచారణ : నవయుగ నుండి అడ్వాన్స్ రికవరీ

టీడీపీకి అయ్యన్న సోదరుడు గుడ్ బై
మాజీ మంత్రి తెలిసిందే. అయ్యన్న పుట్టినరోజు నాడే, సోదరుడు సన్యాసి పాత్రుడు పుట్టినరోజు కూడా. తన పుట్టిన రోజు నాడే పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేయడం కార్యకర్తల్లో నాయకుల్లో డైలమా మొదలైంది. గత కొద్ది రోజులుగా సోదరులిద్దరూ మధ్య మనస్పర్థలు రావడంతోనే ఈ వ్యవహారాన్ని దారితీసింది. విశాఖ డైయిరీకి చెందిన టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు టీడీపీ వీడి వైసీపీలో చేరారు. ఈ షాక్ నుండి టీడీపీ బయటకు రాకముందు ఇప్పుడు కీలక నేత సొంత సోదుడు పార్టీని వీడటంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. అదే సమయంలో అయ్యన్న తాజాగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల పైన చర్చ మొదలైంది. తన పుట్టిన రోజు నాడే సోదరుడు పార్టీ వీడటం పైన సోషల్ మీడియాలో ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకే ఇలా ఫిక్స్ అయ్యారంటూ పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. దీని పైన అయ్యన్న అధికారికంగా స్పందించలేదు.

TDP senior leader Ayyanna Patrudu brother Sanyasi rao resigned TDP

పోలీసుల మీద సహనం కోల్పోయి..ఇలా
నర్సీపట్నంకు మాజీ మంత్రి లోకేశ్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించడానికి యత్నించారు. అయితే పోలీసులు మాత్రం ర్యాలీకి అనుమతి నిరాకరించారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న కొండా లోకేష్‌, మాజీమంత్రి అయ్యన్నను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈ క్రమంలో అయ్యన్న మాట్లాడుతూ ఒకింత సహనం కోల్పోయి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు జాగ్రత్తగా, న్యాయంగా వ్యవహరించండి...మూడేళ్ళలో ఎన్నికలు రాబోతున్నాయ్. మీరు మళ్ళీ మా దగ్గరే పని చేయాలి. హెల్మెట్లు లేకుండా ర్యాలీకి అనుమతి లేదంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఈ పద్ధతి వుందా.. నర్సీపట్టణంలోనే ఉందా..తప్పు పోలీసులది కాదు ముఖ్యమంత్రి నుంచి ఒత్తిడి ఉందీ..అంటూ అయ్యన్న సీరియస్ అయ్యారు. రెండు రోజుల క్రితం రాజకీయంగానూ అయ్యన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. బీజేపీ..టీడీపీ..జనసేన తిరిగి కలిసి పోటీ చేస్తాయని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున చర్చ సాగింది. బీజేపీ నేతలు మాత్రం తమకు ఎవరితోనూ పొత్తులు లేవంటూ ఖండించారు. ఇప్పుడు తిరిగి పోలీసుల పైన చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

English summary
TDP senior leader Ayyanna Patrudu brother Sanyasi rao resigned TDP. On his birthday Ayyana serious comments on police. Now these comments became controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X