వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చట్టం ఒప్పుకోదని ఆగారే తప్ప.. బీసీ కార్పొరేషన్‌కు రెడ్లను నియమించేవారు: అయ్యన్నపాత్రుడు విసుర్లు

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమర్శలు ట్విట్టర్ వేదికగా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేతలు ట్విట్లు చేస్తున్నారు. ఇవాళ ఉదయం చంద్రబాబుపై విజయసాయి రెడ్డి స్టార్ట్ చేశారు. బీసీలకు పదవుల అంశాన్ని ఆయన ఎంచుకున్నారు. అయితే తర్వాత టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు రంగంలోకి దిగారు. విజయసాయిరెడ్డి లక్ష్యంగా ట్వీట్లు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతోంది ఏంటీ అని విరుచుకుపడ్డారు.

అప్పుడు పట్టించుకోలే..కానీ

అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలేదు చంద్రబాబు అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై అయ్యన్నపాత్రుడు స్పందించారు. బీసీలంటే సీఎం జగన్‌కు చిన్నచూపు అని చెప్పారు. రాష్ట్రాన్ని ఐదు ముక్కలుగా చేశారని ఆరోపించారు. ఐదుగురు రెడ్లకు జగన్ కట్టబెట్టలేదా అని ప్రశ్నించారు. కీలకమైన 850 పదవుల్లో రెడ్లను నియమించలేదా అని అడిగారు. మరీ మిగతా సామాజిక వర్గాలు ఏం కావాలి అన్నారు. వారికి రాజకీయంగా అవకాశం ఇవ్వరా అని నిలదీశారు.

చట్టం ఒప్పుకోదని ఆగారే తప్ప

వాస్తవానికి చట్టం ఒప్పుకోదు అని ఆగారు తప్పా.. 56 బీసీ కార్పొరేషన్లకు రెడ్లను నియమించేవారు అని విరుచుకుపడ్డారు. కానీ వారిని ఎంపిక చేసింది మీరు కాదా అని అడిగారు. జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దుష్ట చతుష్టయం అని.. అన్నీ పదవులను భర్తీ చేస్తోంది వీరేనని ఆరోపణలు చేశారు. బీసీ కార్పొరేషన్ రూ. 3422 కోట్ల నిధులను మళ్లించడం సరికాదని విరుచుకుపడ్డారు.

ఎందుకు తగ్గించారు..?

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఎందుకు తగ్గించారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. వెనకబడిన తరగతులు అంటే ఎందుకు చిన్నచూపు అని అడిగారు. వారికి వెన్నుపోటు పొడిచి ఏం సాధిస్తామని అనుకుంటున్నారని విరుచుకుపడ్డారు. బీసీల ఓట్లు కావాలి కానీ.. వారికి పదవులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. అంతేకాదు వారి కోసం కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం చేసే అన్నీ చర్యలను ప్రజలు నిశీతంగా గమనిస్తున్నారని తెలిపారు.

మాటలు-మంటలు

మాటలు-మంటలు

సోషల్ మీడియా వేదిక అధికార- విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే బీసీలకు పదవులు/ నిధుల కేటాయింపు అంశంపై విజయసాయిరెడ్డి-అయ్యన్నపాత్రుడు ట్వీట్ వార్ జరిగింది. విజయసాయికి అయ్యన్న కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్‌కు అధికార పార్టీ నుంచి ఎవరూ స్పందిస్తారో చూడాలి మరీ.

English summary
ayyannapatrudu slams vijaya sai reddy: tdp senior leader ayyannapatrudu slams ysrcp mp vijaya sai reddy on various issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X