వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నందమూరి ఫ్యామిలీ తులసీవనం.. విజయసాయి గంజాయి మొక్క: అయ్యన్నపాత్రుడు విసుర్లు..

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్ సీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల పురందేశ్వరిపై విజయసాయి చేసిన కామెంట్లను ప్రస్తావించారు. అమరావతి రాజధాని ఉండాలని చెప్పడం తప్పా అని అయ్యన్న విరుచుకుపడ్డారు. మంగళవారం అయ్యన్నపాత్రుడు మీడియతో మాట్లాడారు. విజయసాయిరెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

బాబూ గారూ.. మీకు ప్రజలు శాశ్వతంగా చెక్ పెడతారు: విజయసాయిరెడ్డి..బాబూ గారూ.. మీకు ప్రజలు శాశ్వతంగా చెక్ పెడతారు: విజయసాయిరెడ్డి..

సాయిరెడ్డి జైలు పక్షి..

సాయిరెడ్డి జైలు పక్షి..

విజయసాయి రెడ్డి జైలు పక్షి అని అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. ఆర్థిక నేరాల కేసు ఏడాదిలో పూర్తిచేస్తామని చెబితే వెన్నులో వణుకు మొదలయ్యిందని చెప్పారు. నందమూరి కుటుంబం తులసీవనం వంటిదని చెప్పారు. అలాంటి కుటుంబానికి చెందిన నేతను విమర్శించడం సరికాదన్నారు. విజయసాయి రెడ్డి గంజాయివనంలో మొక్క లాంటి వారు అని విరుచుకుపడ్డారు. ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో దొంగలు రాజ్యమేలుతారని చెబితే విశ్వసించలేదని.. కానీ అహంకారంతో మాట్లాడటం చూస్తున్నానని తెలిపారు.

సీబీఐ ఎంక్వైరీ..

సీబీఐ ఎంక్వైరీ..

విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందులో నేతలతోపాటు ఐఏఎస్ అధికారులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ జరిపితే ఏం జరిగిందో తెలుస్తోంని చెప్పారు. గత 16 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. మాటలే తప్ప చేతలు లేవని మండిపడ్డారు. దీనిని ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పారు. కానీ ఇతర పార్టీ నేతలను విమర్శించడం సరికాదని హితవు పలికారు.

Recommended Video

Watch New AICC Telangana Incharge Manickam Tagore Meets Party Leaders | Oneindia Telugu
బీజేపీ నేతలు కూడా

బీజేపీ నేతలు కూడా

అమరావతి రాజధాని ఉండాలని ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పురందేశ్వరి కామెంట్ చేశారు. ఆమె జాతి నాయకురాలో.. జాతీయ నాయకురాలో స్పష్టమయ్యిందని విజయసాయి ట్వీట్ చేశారు. దీంతో దుమారం చెలరేగింది. బీజేపీ నేతలు ఒంటికాలపై లేచారు. అయితే టీడీపీ నుంచి అయ్యన్నపాత్రుడు కూడా రియాక్టవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారీ పార్టీలు వేరైనా అమరావతి రాజధాని కోసం.. కామెంట్ చేశారని విశ్లేషకులు అంటున్నారు. రాజధానికి బీజేపీ సపోర్ట్ కోసం అయ్యన్న రియాక్టయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary
tdp senior leader ayyannapatrudu slams ysrcp mp vijayasai reddy on purandeshwari comments issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X