వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీలో బాంబ్ పేల్చిన బుచ్చయ్య చౌదరి! రాజీనామా చేస్తా.. ఐదారు సార్లు ఓడినవారికి ప్రాధాన్యమా?

|
Google Oneindia TeluguNews

టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీలో పరిస్థితుల పైనా కీలక కామెంట్లు చేసారు. పార్టీలో తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని సూచించారు. అదే విధంగా అయిదారు సార్లు ఓడిన వారికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. అయితే, పార్టీలో ఎవరిని ఉద్దేశించి గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేసారనేది ఇప్పుడు పార్టీలో చర్చ మొదలైంది. అయిదారు సార్లు ఓడిన వారు..పార్టీలో ప్రాధాన్యత దక్కించుకుంటున్న వారి లిస్టులో చాలా మందే ఉన్నారు. అందులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టార్గెట్ వారేనా..ఎందుకు...

టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తా..

టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తా..

టీడీపీ సీనియర్ నేత..పార్టీ శాసనసభా పక్ష ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ఎన్నికల్లో ఓడిన సమయం నుండి ఆయన సందర్భం వచ్చిన ప్రతీ సారీ తన భావాలను ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఇక, ఇప్పుడు తాను టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. చేశారు. తాను రాజీనామా చేసిన తర్వాత ఆ పదవి బీసీ నేతకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతానన్నారు. శాసనసభ లో టీడీపీకి మొత్తం 23 మంది సభ్యులు ఉండగా..పార్టీ అధినేత చంద్రబాబు ముగ్గురు ఉప నేతలను ఖరారు చేసారు. అందులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీసీ వర్గానికి చెందిన అచ్చెన్నాయడు..కాపు వర్గానికి చెందిన రామానాయుడు ఉన్నారు. అయితే, తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన పదవికి రాజీనామా చేస్తానని..బీసీ వర్గానికి ఆ పదవి ఇవ్వాలని చెప్పటం ద్వారా గత సమావేశాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు పక్కన సీటులో అచ్చెన్నాయుడు కూర్చోవటం..ప్రభుత్వ పక్షం నుండి అభ్యంతరం రావటం..తిరిగి బుచ్చయ్య చౌదరి కూర్చొనే సమయంలో చంద్రబాబు బీసీ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడుకు..లేదా తాను కోరుకున్న వారు తన పక్కన కూర్చొనేలా అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. దీని పైన అదే సమయంలో బుచ్చయ్య చౌదరి కొంత ముభావంగా కనిపించారు. ఇప్పుడు సడన్ గా తాను టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తానని చెప్పటం వెనుక కారణం ఇదేననే ప్రచారం సాగుతోంది.

తెల్ల ఏనుగులు..అయిదారు సార్లు ఓడినవారంటూ

తెల్ల ఏనుగులు..అయిదారు సార్లు ఓడినవారంటూ

పార్టీలో తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని పార్టీ అధినేతను కోరుతానని బుచ్చయ్య వ్యాఖ్యానించారు. పార్టీలో కొంత మంది అధినేత వద్ద కోటరీగా ఏర్పడి పార్టీ మీద పెత్తనం సాగిస్తున్నారనే భావన అనేక మంది పార్టీ నేతలు వ్యక్తం చేసారు. ఆ క్రమంలో భాగంగానే ఇప్పుడు బుచ్చయ్య వ్యాఖ్యలు చేసారనే అభిప్రాయం వినిపిస్తోంది. చెప్పుకొచ్చారు. ఐదారు సార్లు ఓడినవారికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారని బుచ్చ య్య ప్రశ్నిస్తున్నారు. పాలిట్ బ్యూరో సమావేశంలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి పైన ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. పార్టీ కోసం యాక్టివ్ గా ఉన్నారంటూ కితాబిచ్చారు. అయిదారు సార్లు ఓడినా పార్టీలో క్రియాశీలకంగా..అధినేత వద్ద గుర్తింపు ఉన్న నేతగా సోమిరెడ్డి ఉన్నారు. అదే విధంగా.. తన సొంత జిల్లాకు చెందిన మరో సీనియర్ నేతను ఉద్దేశించి బుచ్చయ్య ఈ రకంగా కామెంట్ చేసారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి కొనసాగింపుగా..సీనియర్లు తప్పుకుని యువతకు అవకాశమివ్వాలని బుచ్చయ్య పిలుపునిచ్చారు. ఇక, ఇప్పుడు బుచ్చయ్య మాటలు ప్రస్తుతం టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి.

ఇక ఎన్నికల్లో పోటీ చేయను..

ఇక ఎన్నికల్లో పోటీ చేయను..

బుచ్చయ్య చౌదరి మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆరుసార్లు గెలిచానని.. అయితే భవిష్యత్తులో ఇక పోటీ చేయనని గోరంట్ల తేల్చిచెప్పారు. సంక్షేమం, అభివృద్ధి చేసినా పార్టీ గెలవలేదంటే ఎక్కడో లోపం ఉందన్నారు. మంత్రులు, జిల్లా, మండల స్థాయి నాయకత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. దీని ద్వారా బుచ్చయ్య చౌదరి పార్టీలో పరిస్థితి మీద అసహనంతో ఉన్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు బుచ్చయ్య చెప్పినట్లుగా టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తే పార్టీలో కొత్త చర్చకు కారణమవుతారు. మరి..ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద అధినేత చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

English summary
TDP Senior leader Gorantla Buchiah Chowdary serious comments on Party situation. He announced his resigantion for TDLP Deputy leader. He Demanded Give priority for youth in party posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X