• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చెప్పేవి శ్రీరంగనీతులు..చేసేవి పాడుపనులు: కెమెరా కంటికి చిక్కిన టీడీపీ సీనియర్ నేత రాసలీలలు..వీడియో

|

పేరుకే లీడర్లు... నాయకులు... చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి గలీజు పనులు. వయసును సైతం మరిచి కామక్రీడల్లో తేలియాడుతున్నారు కొందరు నేతలు. ఇప్పటికే పలువురు స్వామీజీలు కామకలాపాలు నెరిపిన ఘటనలు చూశాం... ఇప్పుడు రాజకీయనాయకులు కూడా ఇదే తంతుకు పాల్పడుతున్నారు. ఇంతకీ ఎవరా నేత... ఆయన చేసిన గలీజు పనేంటి...?

కెమెరా కంటికి చిక్కిన టీడీపీ నేత సాధూరావు కామ క్రీడ

కెమెరా కంటికి చిక్కిన టీడీపీ నేత సాధూరావు కామ క్రీడ

ఇదిగో ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు నెల్లి సాధూరావు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన టీడీపీ నేత. ఇప్పటికే విశాఖ జిల్లా టీడీపీలో నేతల మధ్య విబేధాలు అధ్యక్షుల వారికి తలనొప్పిగా మారాయి. తాజాగా సాధూరావు నెరిపిన శృంగార క్రీడ ఎన్నికలకు ముందు టీడీపీకి పెద్ద తలపోటుగా మారింది. ఇక అసలు విషయానికొస్తే విశాఖ జిల్లాలో సాధురావు అనే తెలుగుదేశం సీనియర్ నేత ఓ మైనర్ బాలికతో సరసాలకు దిగాడు. ఈ దృశ్యాలు మూడో కంటికి చిక్కాయి. సాధురావు వయస్సు 85 ఏళ్లు. అయితే తాను సరసాలు నెరిపింది ఆయన మనవరాలు వయస్సున్న 17 ఏళ్ల మైనర్ బాలికతో. చింత చచ్చినా పులుపు చావలేదు మనోడికి. కాటికి కాలు చాపుతున్న వయస్సులో కామకలాపాల్లో మునిగిపోయి జనం చేత ఛీకొట్టించుకుంటున్నాడు. వయస్సు హోదాను మరిచి పడకలో బరితెగించాడు ఈ తాతయ్య.

పార్టీ ఆఫీసే సాధూరావుకు పడకగదిగా మారిన వేళ...

పార్టీ ఆఫీసే సాధూరావుకు పడకగదిగా మారిన వేళ...

నెల్లి సాధూరావు కామకేళికి నెరిపింది ఏ గెస్ట్ హౌజ్‌లోనో లేకుంటే తన సొంత ఇంటిలోనో కాదు. ఆయన శృంగారానికి వేదికగా నిలిచింది ఏకంగా టీడీపీ ఆఫీసు కావడం విశేషం. టీడీపీ ఆఫీసులో ఇద్దరు మహావ్యక్తుల ఫోటోలు ఉంటాయి. ఒకటి రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ ఫోటో కాగా మరొకటి మహాత్మ జ్యోతిరావు పూలేది. పగటి వేళల్లో ప్రెస్ మీట్లతో నానా హంగామా కనిపిస్తుంది. రాత్రి అయ్యేసరికి ఇదిగో ఇలా శృంగార క్రీడకు వేదికవుతోంది. పార్టీ ఆఫీసునే పడకగదిగా మార్చిన ఈ పెద్దాయనపై టీడీపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వయస్సులో మరీ ఇంత కక్కుర్తి ఏంటని చెవులు కొరుక్కుంటున్నారు. మనవరాలు వయసున్న అమ్మాయితో ఈ చెండాలమేంటని గుసగుసలాడుకుంటున్నారు.

దశాబ్దాలుగా గడించిన పేరు ఒక్క వీడియోతో మటాష్

దశాబ్దాలుగా గడించిన పేరు ఒక్క వీడియోతో మటాష్

సాధురావు చేస్తున్న పాడుపని కెమెరా కంటికి చిక్కింది. అంతే అప్పటి వరకున్న ఆయన పరువు రాజకీయంగా ఆయన సంపాదించిన పేరు అన్నీ గంగలో కలిశాయి. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మనోడి ముఖం చాటేస్తున్నాడు. ఇదే పని సామాన్యుడు కనుక చేసి ఉంటే సిగ్గుందా... అసలు మనిషివేనా అంటూ నానా ప్రశ్నలు పొడుస్తాయి. ఇప్పుడు ఒకరికి ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయనేతే ఇలా బరితెగించి పాడుపనికి పాల్పడటంతో జనాలు ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ ఫథకాల కోసం సహాయం చేయాల్సిందిగా కోరుతూ వచ్చే అమ్మాయిలపై ఇలా వికృత చేష్టలకు పాల్పడుతూ సాధూరావు అడ్డంగా బుక్కయ్యాడు.

ఈ వయస్సులోనే తాతయ్య ఇలా ఉంటే యంగ్ ఏజ్‌లో రెచ్చిపోయి ఉండేవారేమో..!

ఈ వయస్సులోనే తాతయ్య ఇలా ఉంటే యంగ్ ఏజ్‌లో రెచ్చిపోయి ఉండేవారేమో..!

మొత్తానికి సాధూ సాగించిన ఈ కామకేళి ఎన్నికల ముందు టీడీపీకి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇప్పటికే జిల్లా టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకోగా సాధూ శృంగార ఎపిసోడ్ ఆ పార్టీని మరింత కష్టాల్లోకి నెట్టింది. ఇప్పటి వరకు సాధురావు వైజాగ్ జిల్లాలో మాత్రమే సుపరిచితుడు. శృంగారం ఎపిసోడ్‌ బయటకు రావడంతో తాతయ్య పేరు ఒక్క విశాఖ జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో సైతం మారుమోగుతోంది. ఇక కుటుంబ సభ్యులకు తన మొహం చూపించగలడా అంటూ టీడీపీ నేతలే చెబుతున్నారు. ఎనిమిది పదుల వయస్సులో కూడా తాతయ్య ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నాడంటే వయస్సులో ఉన్నప్పుడు ఏ రేంజ్‌లో రెచ్చిపోయి ఉంటారో అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. తాతయ్య వయస్సు ఎయిటీ ఫైవ్ కావొచ్చు కానీ మనస్సు మాత్రం యంగ్ ఎయిటీన్ అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A senior TDP leader in Visakhapatnam made headlines when his video romancing a 17year old girl leaked. Nelli Sadhu Rao who is a senior TDP leader was engaged with a minor girl in the TDP office in the 63rd ward. The video that surfaced just few months before the elections has brought new troubles to TDP.Sadhurao aged 85 was booked for all the wrong reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more