వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

18న వైసీపీలోకి తోట త్రిమూర్తులు..! మరో ఇద్దరు మాజీలు: సైతం జగన్ గ్రీన్ సిగ్నల్...!!

|
Google Oneindia TeluguNews

ఊహించిందే జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత..టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పటం ఖాయమై పోయింది. ఆయన ఈ నెల 18న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. త్రిమూర్తులతో పాటుగా టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని పైన సీఎం జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు నుండి తోట త్రిమూర్తులు టీడీపీ అధినాయకత్వం మీద అసహనంతో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత త్రిమూర్తులు సారధ్యంలో కాకినాడలో టీడీపీ కాపు నేతల సమావేశం జరిగింది. ఆ సమయంలో త్రిమూర్తులు పార్టీ మారుతారని భావించారు. ఇక, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి పర్యటనకు వెళ్లిన సమయంలోనూ త్రిమూర్తులు దూరంగానే ఉన్నారు. ఇక..ఈ నెల 13న త్రిమూర్తులు తన అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. అందులో తాను టీడీపీ వీడి వైసీపీలోకి వెళ్లనున్న విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. ఆయన అనుచరులు సైతం వైసీపీలో చేరటానికి రంగం సిద్దమైంది.

టీడీపీకి తోట త్రిమూర్తులు గుడ్ బై...!!
అనేక తర్జన భర్జనల తరువాత తూర్పు గోదావరి ప్రముఖ నేత తోట త్రిమూర్తులు టీడీపీ వీడాలని నిర్ణయించారు. కొద్ది కాలంగా ఆయన పార్టీలో కొనసాగాలా లేక బీజేపీ..వైసీపీ నుండి ఆహ్వానం ఉండటంతో ఆ రెండు పార్టీల్లో ఎందులో చేరాలా అనే దాని పైన అనేక చర్చలు చేసారు. బీజేపీ నుండి జాతీయ నేత రాం మాధవ్ తో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సైతం త్రిమూర్తులను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు..జిల్లా సమీకరణాలు చూసిన తరువాత ఆయన వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తన ముఖ్య అనుచరులతో త్రిమూర్తులు శుక్రవారం అంటే ఈ నెల 13న కీలక సమావేశం ఏర్పాటు చేసారు. అందులో తాను టీడీపీ ఎందుకు వీడుతుందీ..ఏ పార్టీలో చేరుతుందీ అనే అంశం పైన స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. ఆయన కొద్ది కాలంగా టీడీపీ వీడుతారనే సంకేతాలు ఉన్నా.. ఏ పార్టీలో చేరుతారనే దాని మీద స్పష్టత రాలేదు. ఇక, ఇప్పుడు వైసీపీ నుండి త్రిమూర్తులకు రాజకీయ భవిష్యత్ మీద స్పష్టమైన హామీ వచ్చినట్లుగా చెబుతున్నారు. జిల్లాలో పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించటంతో పాటుగా.. కొద్ది కాలం తరువాత ప్రభుత్వంలోని కీలక పదవి ఇచ్చేలా ఒప్పందం జరిగిందని సమాచారం. ఈ మేరకు వైసీపీ ముఖ్య నేతలు త్రిమూర్తులుకు హామీ ఇచ్చారని..ముఖ్యమంత్రి జగన్ సైతం ఆమోదం తెలిపారని తెలుస్తోంది.

TDP senior leader Thota Trimurthulu decided to join in YCP on 18th of this month

18న వైసీపీలో చేరిక..మరో ఇద్దరు మాజీలు సైతం..
ఇక..తోట త్రిమూర్తులు ఈ నెల18న వైసీపీలో చేరటానికి ముమూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. త్రిమూర్తులతో పాటుగా మరో ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరటానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు త్రిమూర్తులు వారితో మంతనాలు జరిపారని..వారు సైతం అంగీకరించారని చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆ ఇద్దరు సైతం టీడీపీలో క్రియా శీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయం లో టీడీపీ అధినాయకత్వం కాపు నేతలను విస్మరించిందని.. ఒక వర్గం నేతలకు ఆర్దికంగా సాయం అందించిందని తోట త్రిమూర్తులు తన ఆవేదన వెల్ల గక్కారు. ఇక..గత వారం టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి పర్యటనకు వెళ్లారు. అక్కడ నియోకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. అయితే..తోట త్రిమూర్తులకు స్వయంగా చంద్రబాబు మాట్లాడే ప్రయత్నం చేసినా..ఆయన సమావేశానికి హాజరు కానని తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో..చంద్రబాబు సైతం ఇక త్రిమూర్తులు పార్టీ వీడుతారనే అంచనాకు వచ్చారు. అందులో భాగంగానే..ఒకరిద్దరు నేతలు పార్టీ వీడినా నష్టం లేదని వ్యాఖ్యానించారు. దీంతో.. ఇప్పుడు త్రిమూర్తులు వైసీపీలో చేరటం ఖాయమనే సమాచారంతో..మరి కొంత మంది కాపు నేతలు సైతం టీడీపీ నుండి బయటకు వస్తారనే ప్రచారం గోదావరి జిల్లాల్లో సాగుతోంది.

English summary
TDP senior leader Thota Trimurthulu decided to join in YCP on 18th of this month. since one month Thota discussing with his followers on party changing. Trimuruthulu may be resign tomarrow for TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X